మీ ఏజ్ పెరుగుతున్నట్టు అనిపిస్తుందా...? యవ్వనంగా(Young) ఉండాలని కోరకుంటున్నారా...? కొన్ని అలవాట్లతో మీ వయస్సును(Age) తగ్గించుకోవడంతో పాటు.. యవ్వనంగా తయారు అవ్వచ్చు అని తెలుసుకోండి.

మీ ఏజ్ పెరుగుతున్నట్టు అనిపిస్తుందా...? యవ్వనంగా(Young) ఉండాలని కోరకుంటున్నారా...? కొన్ని అలవాట్లతో మీ వయస్సును(Age) తగ్గించుకోవడంతో పాటు.. యవ్వనంగా తయారు అవ్వచ్చు అని తెలుసుకోండి.

1. బాదం(Almond), వేరుశెనగ వంటి కొన్ని గింజలను(Seeds) రోజూ తినండి. దీన్ని తింటే గుండె జబ్బులు(Heart Problems) తగ్గుతాయి. ఇది జీవితాని మరో మూడేళ్లు పెంచుతుందని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు. నట్స్‌లో గుండె-ఆరోగ్యాన్ని కొపాడే... మంచి కొలెస్ట్రాల్ మరియు సెలీనియం పుష్కలంగా ఉన్నాయి, ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

2. వారానికి రెండు సార్లు మీ ఆహారంలో చేపలను(Fish) తీసుకోండి రెండిటిలో ఒకటి ఆయిల్ ఫిష్(Oil fish) అయి ఉండాలి. ఆయిల్ ఫిష్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3. భోజనానికి మధ్య 3 గంటల విరామం ఉండేలా చూసుకోండి. దొరికిన ప్రతీది తినేయకండి.. ఉదయం అల్పాహారం తో పాటు.. రెండు బోజనాలు టైమ్ కు తినండి. అంతే కాదు అల్పాహారం మంచిగా తిన్నా.. రాత్రి భోజనాన్ని కాస్త తగ్గించుకోండి.

4. రోజూ నాలుగు కప్పులకు మంచి కాఫీగాని(Coffee) టీ(Tea) కాని తాగకంటి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కాఫీని వదులుకోవద్దు. మితంగా కాఫీ తాగడం వల్ల మధుమేహం, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ వ్యాధులను నివారించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

5. రోజూ పండ్లు మరియు కూరగాయలను(Vegetables) ఎక్కువగా తినడానికి ప్రయత్నించండి.. ఇవి మీ ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది వేస్తుంది. పండ్లు మరియు కూరగాయల్లోని 'యాంటీఆక్సిడెంట్లు' క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు వంటి తీవ్రమైన వ్యాధులను నివారిస్తాయి, కూరగాయలు మరియు పండ్లు ఎక్కువగా పీచుపదార్థాలు మరియు తక్కువ చక్కెర కలిగి ఉంటాయి.

6. రోజుకు 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదు. అంతే కాదు ఉడుకుతున్నప్పుడు మాత్రమే ఉప్పు కలపండి. తినేప్పుడు సాల్డ్ ఆడ్ చేసుకోవడం మానేయండి.. ఇది చాలా ప్రమాదం.

7. వివిధ రంగుల కూరగాయలు మరియు పండ్లు మీ భోజనంలో భాగం అయ్యేలా చూడండి. ఉన్నాయి. ప్రతి రంగు కూరగాయలు మరియు పండ్లలో వివిధ రకాల 'యాంటీ-ఆక్సిడెంట్లు' ఉంటాయి. అవి మిమ్మల్నీ ఆరోగ్యవంతులుగా చేస్తాయి.

Updated On 23 May 2024 7:33 AM GMT
Ehatv

Ehatv

Next Story