కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా వ్యాయామం చేయడానికి బద్దకిస్తుంటాం. అంతేకాకుండా ఈ కాలంలో మద్యం సేవించడం, మటన్‌ తినడంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి.

కొవ్వు పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా వ్యాయామం చేయడానికి బద్దకిస్తుంటాం. అంతేకాకుండా ఈ కాలంలో మద్యం సేవించడం, మటన్‌ తినడంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతాయి. శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి తీసుకోవాల్సిన ఐదు ఆహారాలేంటో తెలుసుకుందాం

ఒమేగా -3(Omega-3) కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. వాల్‌నట్‌లు(Wallnuts), ఫిష్‌(Fish), చియా విత్తనాలు(Chia seeds), అవిసె గింజలు వంటి వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి అధిక బీపీని తగ్గించడంతోపాటు రక్తం గడ్డకట్టడాన్ని అరికడతాయి.

ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్‌లో వోట్‌ మీల్ తీసుకోవచ్చు. ఇందులో ఉండే పీచు పదార్ధం ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహాయపడతాయి.

పాలకూర(Spinach), ముల్లంగి, బీట్‌రూట్‌(Beetroot), క్యాబేజీ(Cabbage), క్యాలీఫ్లవర్(califlower), బ్రకోలీ(Broculli), దుంపలు, క్యారెట్‌లు, బీన్స్.. వంటి కూరగాయలు కూడా బ్యాడ్‌ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి.

అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తినాలని కూడా చెప్తున్నారు. డ్రై ఫ్రూట్స్‌లో మల్టీ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బాదం, వాల్ నట్స్ వంటి ఫ్రూట్స్‌ తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను అరికట్టే అవకావశం ఉంది. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆవకాడ కూడా చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

Updated On 26 Jan 2024 3:56 AM GMT
Ehatv

Ehatv

Next Story