అజీర్తి(Indigestion) అంటే.. తిన్నది అరగకపోవడం.. ఈసమస్య ప్రస్తుతం చిన్న పెద్దా అన్న తేడా లేకుండా వస్తోంది. మరి ఈసమస్యల నుంచి బయటపడే మార్గం ఏంటి..? సింపుల్ గా ఏం చేస్తే.. ఈసమస్య నుంచి బయట పడేమార్గాలు ఏంటీ..?
అజీర్తి(Indigestion) అంటే.. తిన్నది అరగకపోవడం.. ఈసమస్య ప్రస్తుతం చిన్న పెద్దా అన్న తేడా లేకుండా వస్తోంది. మరి ఈసమస్యల నుంచి బయటపడే మార్గం ఏంటి..? సింపుల్ గా ఏం చేస్తే.. ఈసమస్య నుంచి బయట పడేమార్గాలు ఏంటీ..?
అజీర్తి.. చాలా మందికి ఈ పదం అర్ధం కాకపోవచ్చుకాని.. తిన్నది అరగకపోవడం.. అంటే మాత్రం అర్ధం అవుతుంది. ఈ సమస్య వస్తే.. మనిషి జీవితంలో ప్రశాంతత కరువైనట్టే.. ఎందుకంటే తన్నది అరగకపోవతే.. అది గ్యాస్ ప్రాబ్లమ్ కు దారి తీస్తుంది. కడుపులో నొప్పి స్టాట్ అవుతుంది. గ్యాస్ గుండెకు పట్టినా.. తలకు పట్టినా అది పెద్ద సమస్యగా మారుంది.
ఇప్పటి రోజుల్లో అందరిని ఇబ్బంది పెడుతున్న అనేక ఆరోగ్య సమస్యల్లో అజీర్ణం కూడా ముఖ్యమైన సమస్య. తిన్న తిండి అరగక ఎంతో ఇబ్బంతి పడుతుంటారు చాలా మంది. దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు(Health Issues) వెంటాడుతుంటాయి... ఇస్టమైన ఫుడ్ ఎదురుగా ఉన్నా తినడానికి భయపడే విధంగా మారుతుంది ఈసమస్య రాను రాను తిండి తినడానికి కూడా భయపడే పరిస్థితి రాకముందే ముందు జాగ్రత్త తీసుకుంటే ఈ అజీర్ణం సమస్యను తరిమికొట్టొచ్చు.
పచ్చి అరటి కాయ(Raw Banana)ఉంటుంది కదా... కూరకు వాడే ఈ అరటిని ఎండబెట్టి బాగా ఎండిన తరువాత దానిని పొడి చేసి ఆ పొడికి సరిపడా ఉప్పును చేర్చి ఒకటి లేదా రెండు స్పూన్లు రోజు తీసుకుంటే అజీర్ణం సమస్య తొలగిపోతుంది... కడుపు ప్రశాంతంగా మారుతుంది.
మీకు శొంఠి( Dry Ginger) తెలిసే ఉంటుంది. అల్లాన్నిఎండలో ఆరబెడితే శొంఠి అవుతుంది. ఈ శొంటి బైట చిన్న షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ శొంఠి పొడిని బెల్లం(Jaggery)తో కలిపి భోజనం చేయడానికి ముందు తీసుకుంటే, అది అరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు లోపల పైత్యం లాంటివి ఉన్నాకాని దూరం చేస్తుంది.
జీలకర్ర(Cumin)ను ధనియాలను ఖాళీ పాత్రలో వేయించి, వాటిని పొడి చేసి నీటిలో కలుపుకుని త్రాగితే అజీర్తి తొలగిపోతుంది.అల్లం, వేపాకు లేత చిగుళ్ళు తీసుకుని వాటిని మొత్తగా గ్రైండ్ చేసి ఆ రసాన్ని తీసి కొద్దిగా ఉప్పు చక్కెర కలుపుని తాగితే పైత్యం, వాతం విరిగిపోయి కడుపులో ఆకలిపుడుంది. తిన్న పదార్ధం ఏదైన మంచి అరుగుదల ఉంటుంది.
రోజు కొంచె వాములో లైట్ గా ఉప్పు కలుపుకుని తింటుంటే... అజీర్ణ సమస్య తొలగిపోతుంది. మంచి ఆకలి పుడుతుంది. ఇలా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపిస్తూ.. కష్ణం అనుకోకుండా రోజు ఈ చిట్కాలు పాటిస్తే... మందులు వాడి రోగాలు నయం చేసుకునే బాధ ఉండదు. జబ్బులకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిన పని ఉండదు.