ఇజ్రాయెల్‌(Israel) దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనాను కబళించుకున్న ఆ దేశం అక్కడి ప్రజలపై కూడా అమానవీయంగా ప్రవర్తిస్తోంది. ఇప్పటికే యుద్ధంలో సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం సహాయం కోసం కన్నీళ్లు ఇంకిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. రోజుల తరబడి సరైన తిండిలేక చావుకు దగ్గరపడుతున్న వారిని ఆదుకోవడం కోసం ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు ఆల్‌ రషీద్‌ వీధికి వచ్చాయి.

ఇజ్రాయెల్‌(Israel) దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనాను కబళించుకున్న ఆ దేశం అక్కడి ప్రజలపై కూడా అమానవీయంగా ప్రవర్తిస్తోంది. ఇప్పటికే యుద్ధంలో సర్వం కోల్పోయిన పాలస్తీనా ప్రజలకు ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటిస్తున్నారు. అంతర్జాతీయ సమాజం సహాయం కోసం కన్నీళ్లు ఇంకిన కళ్లతో ఎదురుచూస్తున్నారు. రోజుల తరబడి సరైన తిండిలేక చావుకు దగ్గరపడుతున్న వారిని ఆదుకోవడం కోసం ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు ఆల్‌ రషీద్‌ వీధికి వచ్చాయి. అప్పటికే వందలాదిగా అక్కడ ఉన్న పాలస్తీనియన్లు ట్రక్కుల చుట్టూ గుమిగూడారు. ఇజ్రాయెల్‌ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ(Food Collecting) జరగాల్సిఉంది. ప్రజలంతా క్యూలో నిల్చున్నారు. కొందరు క్యూలను దాటుకుంటూ ట్రక్కులపైకి ఎగబడ్డారు. గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్‌ చేసిన ఆహారాన్ని ఎత్తుకెళ్లసాగారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది. తొక్కిసలాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్‌ బలగాలు పాలస్తీనియన్లపైకి(Palastine) తుపాకీ గుళ్లవర్షం కురిపించాయి. ప్రజలు పిట్టల్లా రాలిపడ్డారు. ఆ ప్రాంతమంతా మృతదేహలతో నిండిపోయింది. ఈ అమానవీయ దారుణ సంఘటనలో వంద మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 66 మంది మహిళలు, చిన్నారులే ఉండటం మహా విషాదం. మృతదేహాలను, గాయపడినవారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి సరైన అంబులెన్స్‌లు లేకపోవడం మరో విషాదం. గాడిదలపై, గాడిద బండ్లపై మృతదేహాలు, గాయపడిన వారిని తరలించారు. లూటీ నుంచి తప్పించుకోవడానికి ట్రక్కులు కాస్త ముందుకు కదలడంతో వాటి చక్రాల కింద పడి ఇంకొందరు చనిపోయారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం మానవత్వాన్ని మంట కలుపుతున్నది. రెండు నెలలుగా పాలస్తీనా ప్రజలు గడ్డి తిని కడుపునింపుకుంటున్నారు.

Updated On 1 March 2024 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story