ధూమపానం(Smoking) మరియు అధిక బరువు గుండెకు మరింత హానికరం.
1. ధూమపానం(Smoking) మరియు అధిక బరువు గుండెకు మరింత హానికరం.
2. ఎల్లప్పుడూ మితంగా తినండి(Food Limit). కొంచెం ఆకలిగా అనిపించినప్పుడు తినడం మానేయడం మంచిది.
3. తినకుండా డైటింగ్(Diet) చేయడం వల్ల చిరాకు వస్తుంది. శరీరానికి తగినంత పోషకాలు అందకపోవడం వల్ల కొన్నిప్రాణాంతకం అవ్వ వచ్చు.
4. బరువు తగ్గడం - సరైన వ్యాయామం ద్వారా మాత్రమే సాధించవచ్చు. అయితే ఉన్నట్టుండి బరువు తగ్గడం సాధ్యం కాదు.. అలా చేయడం ప్రాణానికి హనికరం.. అందకే ఎక్కువ టైమ్ తీసుకుని మంచి వ్యాయామం చేయండి.. గుండెకు చాలా మంచిది.
5. మీకు ఇష్టమైన ఆహారాన్ని తినడం మానుకోకండి.. కాని అతిగా తినకండి.. మితాహారం అమృతాహారం అన్నారు పెద్దలు.
6. చేపలు(Fish) తినడం వల్ల మన గుండెకు మేలు జరుగుతుంది, అందులో కొన్ని మంచి ఆమ్లాలు ఉంటాయి.
7. రోజూ నట్స్(Nuts) మరియు పండ్లు తినండి. ఫ్రిడ్జ్ లలో నిల్వ ఉంచిన పండ్లు 50 నుండి 60% పోషకాలను కోల్పోతాయి. వాటిని తినడం మానుకోండి.
8. టొమాటోలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, నిమ్మకాయలు మరియు క్యారెట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
9. ఉపయోగించిన వంట నూనెను మళ్లీ ఉపయోగించవద్దు.
10. భోజనం చేసేటప్పుడు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి.