'బ్రెస్ట్ పీస్ ఈజ్ బెస్ట్ పీస్'
చికెన్‌లో(Chicken) ప్రొటీన్లు(Protines) అధికంగా ఉంటాయి. చికెన్ తినేందుకు మాంసాహారులు తహతహలాడుతుంటారు. డైట్ చేసేవారు కూడా తమ ఆహారంలో కొంత చికెన్ ఉండేలా చూస్తారు. అయితే ఫాంలో పెరిగిన కోడి కంటే నాటు కోడి తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుందని చెప్తారు. కానీ నాటు కోడి లభ్యత తక్కువగా ఉండడం, ధర అధికంగా ఉండడంతో ప్రజలు ఫాం చికెన్‌వైపు మొగ్గు చూపుతారు.
అయితే చికెన్ చర్మం(skin) తింటే గుండెకు హానీకరమని వైద్య నిపుణులు చెప్తారు. ఇందులో కొవ్వుశాతం అధికంగా ఉండడంతో చికెన్ చర్మం గుండెకు(Heart) ప్రమాదకరం. అంతేకాకుండా ఫాంలో పెరిగే కోళ్లు త్వరగా వెయిట్ పెరిగేందుకు పలు రసాయనాలు ఇస్తారు, ఇవి కోడి చర్మంపై ఉంటాయి. కోడి చర్మం తింటే మన శరీరంలోకి కూడా అవి ప్రవేశించి పలు రకాల రోగాలకు దారితీస్తుంది. చికెన్ స్కిన్‌ను తినకూడదని గుండె సంబంధ వైద్యులు సూచిస్తున్నారు. కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉన్నందున రక్తపోటు అధికంగా ఉన్నవారికి ఇది ప్రమాదకరమని తేలింది. కానీ చికెన్ స్కిన్‌లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాట్‌లు ఉన్నాయని, ఇవి ఆరోగ్యానికి మంచివేనని అంటున్నారు. అరుదుగా చికెన్ తింటే ఆనందమేనని కానీ అమితంగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుందని హెచ్చరిస్తున్నారు.
చికెన్‌లో తక్కువ భాగం కొవ్వు ఉన్న పార్ట్ చెస్ట్ పార్ట్(Chest Piece). చెస్ట్ పార్ట్‌లో కొవ్వు(Fat) తక్కువగా ఉండి ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే శరీరానికి ప్రొటీన్లు అందించడమే కాకుండా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్రెస్ట్ పార్ట్ కండరాల బలానికి కూడా సహాయపడతాయి. చికెన్ లెగ్ పీస్ అని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు కానీ.. లెగ్ పీస్‌లో కూడా అధికంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. బ్రెస్ట్ పీస్ కంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అంతేకాదు చికెన్ వింగ్స్‌లో కూడా కొవ్వు అధికంగా ఉంటుంది. చికెన్ మితంగా తినేవారికి సమస్యలు రాకపోవచ్చు కానీ రోజువారీ ఆహారంలో చికెన్ తింటే 'బ్రెస్ట్ పీస్ ఈజ్ బెస్ట్ పీస్'