యాదగిరిగుట్ట(yadhagirigutta) లక్ష్మీనరసింహ స్వామి లడ్డూపై(Laddu) భక్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు.

యాదగిరిగుట్ట(yadhagirigutta) లక్ష్మీనరసింహ స్వామి లడ్డూపై(Laddu) భక్తలు ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదు. భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి స్వచ్ఛంగా ఉందని రాష్ట్ర ఆహార ప్రయోగశాల నిర్ధారించినట్టు ఈవో భాస్కర్‌రావు(Bhaskar rao) తెలిపారు. గత నెల 21వ తేదీన నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షించి కల్తీ లేదని తేల్చినట్టు పేర్కొన్నారు. తేమ, ఓలేయిక్‌ యాసిడ్‌ వంటి కొవ్వు ఆమ్లాలు పరిమితంగా ఉన్నట్టు గుర్తించారని భాస్కర్‌రావు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా యాదగిరిగుట్ట ప్రసాదాలతోపాటు స్వామివారి కైంకర్యాలకు మదర్‌ డెయిరీ తయారు చేసిన నెయ్యినే వినియోగిస్తున్నామన్నారు.

టెండర్‌ ప్రకారం కిలోకు 609 రూపాయలు చెల్లిస్తున్నట్టు ఈవో వివరించారు. లడ్డూ ప్రసాదంతోపాటు స్వామివారి పూజలకు రోజూ వెయ్యి కిలోల నెయ్యి వినియోగిస్తున్నామన్నారు. స్వామివారి ప్రసాదాలు, కైంకర్యాలకు మదర్‌ డెయిరీకి బదులు విజయ డెయిరీ నెయ్యిని వినియోగించాలని దేవస్థానానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. టెండర్‌ ప్రకారం 2025 డిసెంబర్‌ 31 వరకు మదర్‌ డెయిరీనే దేవస్థానానికి నెయ్యిని పంపిణీ చేయాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మదర్‌ డెయిరీని తప్పించి విజయ డెయిరీకి టెండర్‌ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నదని భాస్కర్‌రావు చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story