కలియుగంలో(Kaliyuga) ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటువంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు"(Lord Venkateshwara) గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

కలియుగంలో(Kaliyuga) ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటువంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు"(Lord Venkateshwara) గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల(Tirumala) కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు. కృత యుగం - నరసింహావతారం(Lord Narasimha), త్రేతా యుగం - శ్రీరాముడుగా(Lord Rama), ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా(Lord Srikrishna), కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో(Incarnation) చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు. కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు.

ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం(Yuga) ఒక్కో పేరు ఉండేది. కృత యుగం లో - వృషా చలం, త్రేతా యుగం లో - అంజనా చలం, తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

మనకి పాపాలు(Sins) అన్ని ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకుల(Hair) మొదళ్ళుని ఆశ్రయించి ఉంటాయ్. ఆ పాపాలు తీసేయడానికి స్వామి తల వెంట్రుకలు అడుగుతాడు. కలియుగంలో ఏది ఇవ్వాలన్న అందరికి కక్కుర్తి. మన ప్రమేయం లేనిది, మనం పెంచాల్సిన అవసరం లేని దానిని, తనంతట తాను పెరిగేది, భగవంతుని కృప చేత ఉండేది మాత్ర మే ఆయన తీసుకుంటాడు.

వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

వేంకటాచలం(Venkatachela) చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. తిరుమల తర్వాత కాశి కి మళ్లి అంత ప్రత్యేకత ఉంది. మీరు కాశి(Kashi) అడుగు పెట్టినంత మాత్రం చేతనే మీ పాపాలు అన్ని చెట్లు ఎక్కి కుర్చుంటాయి . మీరు 9రాత్రులు గనక గడిపితే, మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయ్....

Updated On 13 Jan 2024 12:44 AM GMT
Ehatv

Ehatv

Next Story