శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఈరోజు ఆగస్టు 26వ తేదీన జరుపుకోవాలని కొందరు అంటున్నారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమిని(Janmashtami) ఈరోజు ఆగస్టు 26వ తేదీన జరుపుకోవాలని కొందరు అంటున్నారు. సోమవారం జరుపుకోకూడదు, మంగళవారం అంటే ఆగస్టు 27వ తేదీన జరుపుకోవాలి అని మరికొందరు అంటున్నారు. ఈ అయోమయానికి కారణమేమిటంటే ఆ అష్టమి తిథి రెండు రోజులనూ కలుపుతూ వచ్చింది. పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 2:19 గంటలకు ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26వ తేదీ సోమవారం మధ్యాహ్నం 03:55 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది. అయితే కృష్ణాష్టమి అనేది రెండు రకాలుగా ఉంటుందని.. అందులో ఒకటి స్మార్త కృష్ణాష్టమి, రెండవది వైష్ణవ కృష్ణాష్టమి..ఎప్పుడైనా కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం ఈ రెండూ కలిసి వచ్చినా సరే వీరు కృష్ణాష్టమి జరుపుకుంటారు. స్మార్తులకు సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలన్న నియమం లేదు. ఆ రోజులో ఎప్పుడైనా సరే రోహిణీ నక్షత్రం ఉంటే స్మార్తులు కృష్ణాష్టమి జరుపుకుంటారు.వైష్ణవులకు కచ్చితంగా సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉండాలి. కృత్తికా నక్షత్రంతో కలవని రోహిణీ నక్షత్రం ఉండాలి. స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26వ తేదీన జరుపుకుంటున్నారు..
వైష్ణవ సంప్రదాయం పాటించే వారు రేపు అనగా ఆగస్టు 27వ తేదీన కృష్ణాష్టమిని జరుపుకుంటారు.