జగన్మాతను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతా యంటుంది.

జగన్మాతను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతా యంటుంది. ‘ఇష్టశ్చోర్జశ్చ శారదావృతూ’’ అన్నది శ్రుతి. తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు కూడా త్రిరాత్ర వ్రతమైనా చేస్తారు. అంటే ఆదిపరాశక్తిని దుర్గగా(Durga Godess) భావించి దుర్గాష్టమి నాడు, దుర్నీతులను రూపుమాపిన మహాశక్తిగా మానవుల్లో ఏర్పడే నవ విధ బాధలను దూరం చేసే మహాతల్లిగా భావించి మహర్నవమి రోజు ఇక దశపాపాలను హరించి దశవిధ విజయాలను కలుగ చేసే విజయలక్ష్మిగా భావించి దసరా రోజు పూజిస్తారు. ఇలా అమ్మవారిని శరన్నవరాత్రుల్లో తొమ్మిదిరోజులు పూజించలేని వారు ఈ మూడు రోజుల్లోనే త్రిరాత్ర వ్రతమని చేస్తుంటారు...

ఈ దసరా నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనది నవమి. ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగుతుంది. కనుక ‘సిద్ధదా’ అని నవమికి పేరు. ఈ మహర్నవమి రోజున దేవి ఉపాసకులు అంతవరకు తాము చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలు చేస్తారు. ఇలా చేయడం వలన సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ మహర్నవమి రోజున క్షత్రియులు, కార్మికులు, వాహన యజమానులతో పాటు కులవృత్తులవారు తమ తమ ఆయుధాలను, పని ముట్లను పూజిస్తారు.

Eha Tv

Eha Tv

Next Story