హిందువులకు(Hindus) శంఖం(Conch) అత్యంత పవిత్రం. ఆధ్యాత్మికంగా చూస్తే అది శుభాలకు సూచిక. వైజ్ఞానిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అమృతం కోసం క్షీర సాగరాన్ని మథిస్తున్నప్పుడు పాల సముద్రం నుంచి బయటకు వచ్చిందని అంటారు. అందుకే దానికి పాంచజన్యం(Panchajanyam) అని పేరు. ఈ పాంచజన్యాన్ని శ్రీ మహా విష్ణువు స్వీకరించాడు.

హిందువులకు(Hindus) శంఖం(Conch) అత్యంత పవిత్రం. ఆధ్యాత్మికంగా చూస్తే అది శుభాలకు సూచిక. వైజ్ఞానిక ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అమృతం కోసం క్షీర సాగరాన్ని మథిస్తున్నప్పుడు పాల సముద్రం నుంచి బయటకు వచ్చిందని అంటారు. అందుకే దానికి పాంచజన్యం(Panchajanyam) అని పేరు. ఈ పాంచజన్యాన్ని శ్రీ మహా విష్ణువు స్వీకరించాడు. శంఖం తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా మహావిష్ణువు స్వీకరించిన విషయం తెలిసిందే. ముందుగా శంఖం, ఆ వెంటనే లక్ష్మీదేవి రావడంతో శంఖాన్ని లక్ష్మీదేవికి అన్నగా చెబుతారు. అదృష్ట వస్తువుల్లో శంఖం కూడా ఒకటి. శం అంటే మంచి. ఖం అంటే జలం. అంటే నీటిని పావనం చేసేదన్నమాట! దేవీ దేవతలకు మమూలు నీటిని శంఖంలో పోసి అభిషేకం చేస్తారు. శంఖంలో పోస్తేనే తీర్థం అనే నానుడి ఇలాగే పుట్టింది. దక్షిణావృత శంఖం కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. దక్షిణావృత శంఖాలను పూజా విధానంలో వనరుగా వినియోగించరు. దైవ స్వరూపంగా భావించి వాటినే (దక్షిణావృత శంఖాలనే) పూజిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఆ దరిదాపులకూ రావని భక్తుల నమ్మకం. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు. దీన్ని పూజా విధానాల్లో తరచుగా వాడతారు. ఇవే కాకుండా శంఖాల్లో అనేక రకాలున్నాయి. ఆకారం, పరిమాణం, లక్షణాలను బట్టి మధ్యమావర్త, లక్ష్మీ, గోముఖ, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ అనే పేర్లతో వివిధ శంఖాలను పిల్చుకుంటున్నాం.

Updated On 18 March 2024 1:09 AM GMT
Ehatv

Ehatv

Next Story