అసలు కాలసర్పాలు ఎవరు? రాహువా? కేతువా? జాతకాలపై అవి దుష్ ప్రభావం చూపిస్తాయా? ఆ ప్రభావం మేలి మలుపా? మూల మలుపా? కాలసర్పం మనిషి జీవితాన్ని నిజంగానే పట్టి పీడిస్తుందా? అది కేవలం మనిషికేనా? యావత్ దేశాన్నికీ వర్తిస్తుందా?దేశాలకు, దేశాధ్యక్షుల జీవితాల్ని ప్రభావితం చేస్తుందా? పాలకులు, పాలితులు అనే తేడా గ్రహాలకు ఉంటుందా? కాలసర్పం దోషమైనా, యోగమైనా ఫలితం అనుభవించక తప్పదా?ఇంతకీ ఏది నిజం? ఎవరి వాదన వాస్తవం? రాహు కేతువులు ఇచ్చే ఫలితాలు అందరూ అనుభవించక […]
అసలు కాలసర్పాలు ఎవరు? రాహువా? కేతువా? జాతకాలపై అవి దుష్ ప్రభావం చూపిస్తాయా? ఆ ప్రభావం మేలి మలుపా? మూల మలుపా? కాలసర్పం మనిషి జీవితాన్ని నిజంగానే పట్టి పీడిస్తుందా? అది కేవలం మనిషికేనా? యావత్ దేశాన్నికీ వర్తిస్తుందా?దేశాలకు, దేశాధ్యక్షుల జీవితాల్ని ప్రభావితం చేస్తుందా? పాలకులు, పాలితులు అనే తేడా గ్రహాలకు ఉంటుందా? కాలసర్పం దోషమైనా, యోగమైనా ఫలితం అనుభవించక తప్పదా?ఇంతకీ ఏది నిజం? ఎవరి వాదన వాస్తవం?
రాహు కేతువులు ఇచ్చే ఫలితాలు అందరూ అనుభవించక తప్పదంటారు జ్యోతిషపండితులు. మన పురాణ ఇతిహాసాలలో కానీ... సరస్వతి పుత్రులైన ఉద్దండ జ్యోతిష రుషిపుంగవులు చెప్పిన విషయాలు వాస్తవమా? కాదా? అన్న మీమాంస ఇప్పుడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుంది. రాహు కేతువులు ఏ జాతకుడికైనా ఉచ్ఛస్థితి ఇచ్చినా దానితో పాటు తీవ్ర మనో వ్యాకులత, ప్రాణనష్టం, రాజ్యభ్రష్టత్వం, భేదం, అవమానాలు ఇవ్వక తప్పదంటున్నాయ్ ఇతిహాసాలు. ఇప్పుడు ఇదే ప్రజలను భయాందోళనల్లోకి నెట్టేస్తున్నాయ్. అంతెందుకు మహాభారత, రామాయణాలలో పుణ్య పురుషులు కూడా అతి దీనంగా దుఃఖించి, కొన్ని సమయాలలో హేయమైన జీవితం గడిపడం కాలసర్ప దోష ఫలితమే అంటారు పండితులు.
సర్పదోషం వేరు. కాలసర్పదోషం వేరు. కాలసర్పదోషానికి పాములకు ఏరకమైన సంబంధం లేదు. ఉండదు కూడా. కేవలం పేరులో సర్పం ఉన్నంత మాత్రాన కాలసర్ప దోషం పాముల వల్ల వస్తుందని అనుకోవటం కరక్ట్ కాదు. కాల సర్ప దోషం వ్యక్తిగత జ్యోతిషం కంటే కూడా దేశాల జాతకాల మీద ప్రభావం ఎక్కువ ఉంటుందనేది వాస్తవం. జాతకంలో దోషాలు ఉండడం మాములే. అలాగే ప్రతి దోషానికి నివారణ ఉపాయాలు కూడా ఉంటాయ్. కాలసర్పదోషం జాతకంలో రాహు కేతువుల వల్ల ఏర్పడుతుందనేది కాస్త జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వారెవరికైనా అర్థం అవుతుంది. అంటే జాతకంలో ఏడు గ్రహాలు రాహు కేతువుల మధ్యలో ఉండిపోవడమే కాలసర్పదోషం అని తేలికగా గుర్తుపట్టవచ్చన్నమాట. జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా అవి ఫలితాలు ఇవ్వకపోవడం వెనుకున్న కారణం... ఆ యోగాల్ని కాల సర్పం మింగేయడమే. వివాహం, సంతానం, దాంపత్యంలో అన్యోన్యత, వృత్తి, ఉద్యోగంలో ఉన్నతి ఇతరత్రా వాటికి ప్రధాన అవరోధంగా మారడం కాలసర్పదోష ఫలితమే.
అసలు కాలసర్పదోషం ఎందుకు వస్తుంది? ఏం తప్పులు చేస్తే ఈ దోషం పడుతుంది? దీని కారణాలేంటి? జ్యోతిష వాక్కు ప్రకారం.. పండితులు మాట ప్రకారం, కాలసర్ప దోషం వంశపారంపర్యంగా వస్తుందంటారు. కానీ చాలామంది అనుకునేది ఒకటుంది. సర్పాలను చంపడం వల్లనే కాలసర్ప దోషం పడుతుందని. కొంత నిజమే అయినా ఇందుకు చాలా కారణాలే చెబుతారు పండితులు. సర్పాలను తెలిసి గానీ తెలియక గానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా చంపడం చేసినా.. దోషం వదలదు అని నిర్ణయ కౌముది చెబుతుంది. పీడించినా... హింసించినా... బంధించినా... సంహరించినా... ఆ పాపం సర్ప దోషం రూపంలో మనుషుల్ని పట్టి పీడిస్తుంది.