జాతకుని జన్మకుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే దానిని కాలసర్ప యోగమంటారని చెప్పుకున్నాం. ఇందులో కూడా చాలా రకాలున్నాయ్. వాటి స్థితులను బట్టి, వాటికి పేర్లు నిర్ణయిస్తారు. దాని ప్రకారమే కాల సర్ప దోషం లేదా యోగం వల్ల వచ్చే ఫలితాలను అంచనా వేస్తారు పండితులు. రాహువు, కేతువులు పరస్పరం సమ సప్తకాలై ఉంటాయ్. అంటే ఈ రెండు గ్రహాల మధ్య దూరం 180 డిగ్రీలు ఉంటుంది. ఇలా ఇవి 12 రాశులలో […]

జాతకుని జన్మకుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే దానిని కాలసర్ప యోగమంటారని చెప్పుకున్నాం. ఇందులో కూడా చాలా రకాలున్నాయ్. వాటి స్థితులను బట్టి, వాటికి పేర్లు నిర్ణయిస్తారు. దాని ప్రకారమే కాల సర్ప దోషం లేదా యోగం వల్ల వచ్చే ఫలితాలను అంచనా వేస్తారు పండితులు. రాహువు, కేతువులు పరస్పరం సమ సప్తకాలై ఉంటాయ్. అంటే ఈ రెండు గ్రహాల మధ్య దూరం 180 డిగ్రీలు ఉంటుంది. ఇలా ఇవి 12 రాశులలో సంచరిస్తున్నపుడు 12 విధాలైన కాలసర్పదోషాలు ఏర్పడుతాయ్. అవేంటో చూద్దాం. అనంత కాల సర్ప దోషం, గుళిక కాల సర్ప దోషం, వాసుకి కాలసర్ప దోషం, శంక పాల కాల సర్పదోషం, పద్మ కాలసర్పదోషం, మహా పద్మ కాల సర్పదోషం, తక్షక కాల సర్పదోషం, కర్కోటక కాలసర్పదోషం, శంఖ చూడ కాలసర్పదోషం, ఘటక కాలసర్పదోషం, విషదాన కాలసర్పదోషం, శేష నాగ కాలసర్పదోషం.

రాహు, కేతువుల ప్రభావం నిజంగా మన మీద ఉంటుందా?

సూర్యుని నుంచి వచ్చే కాంతి కిరణాలు గ్రహాల మీద పడి.. ఆ సప్త కాంతులు మన శరీర, మనస్సులని ప్రభావితం చేస్తుందని జ్యోతిషశాస్త్రం ప్రాథమికంగా మనకు అందించింది. అంటే ఆయా గ్రహాలూ మన మీద ప్రభావాలు చూపిస్తాయని మన పూర్వీకుల వేదోవాక్కు. అంతే కాదు కాంతి మన మీద ఎలా ప్రభావం చూపుతుందో... దాని ఛాయ కూడా అంతే ప్రభావవంతంగా ఉంటుందని, ఆ ఛాయ గ్రహాలే రాహు, కేతువులని సూచించింది. రాహు కేతువులు స్థితి... ప్రతి మనిషి మీద మంచి చెడుల ఫలితాలను చూపుతాయి. ఈ గ్రహాల విషయాలు, వర్ణనలు, పుట్టుకలు శ్లోకాలు, కథల రూపంలో జ్యోతిషంలో అద్భుతంగా వర్ణించారు. అప్పటి రోజులలో కంప్యూటర్లు లేవు. టెక్నాలజీ అంటేనే తెలియదు. కానీ మనకంటే కూడా మన మహర్షులు ఇంకా కొన్ని అడుగులు ముందుకు వేసి అనుభవాలు, మంచి, చెడులు, నివారణోపాయాలు కూడా చెప్పారు. వాటిని ఆచరించి ఫలితాలను అనుభవించాలే కనీ... వాదనలతో నిరుపించాలేమన్న అభిప్రాయాలు ఉన్నాయ్.

కాలసర్పంలో మంచి యోగాలు, చెడు యోగాలు ఉండొచ్చు. ఇది కేవలం మనుషులకే కాదు... రాష్ట్రాలకీ, దేశానికీ కూడా వర్తిస్తుందట. ఎలా అంటే... రాహువు, కేతువులు మిగిలిన గ్రహాలకు వ్యతిరేక దిశలో నడుస్తాయ్. మిగిలిన ఏడు గ్రహాలు రాహువు ఉన్న దిశ వైపు నడచిన కాల సర్ప యోగం ఏర్పడుతుందనేది భారతీయుల సిద్ధాంతం. యురేనస్, నెఫ్ట్యూన్‌, ఫ్లుటో గ్రహములు రాహు కేతువుల కక్ష్య వెలుపల ఉన్న కాలసర్ప యోగం ఏర్పడుతుందనేది పాశ్చాత్యుల సిద్ధాంతం. ఇందులో కూడా సవ్య, అపసవ్య కాలసర్ప దోషాలు ఉంటాయి. రాహువు నుంచి కేతు గ్రహం వరకు సప్త గ్రహాలు ఉంటే అది సవ్య కాలసర్ప దోషంగా, కేతువు నుంచి రాహు గ్రహ మధ్యలో సప్త గ్రహాలు ఉంటే దాన్ని అపసవ్య కాలసర్పదోషంగా పిలుస్తారు. ఇక మూడవది రాహు, కేతుల మధ్య లగ్నం ఉండి మిగిలిన సప్త గ్రహాలూ కేతు, రాహుల మధ్య ఉంటే అది లగ్న కాల సర్పదోషంగా కూడా పిలుస్తారు.

వాస్తవానికి కాలసర్ప దోషం గురించి....ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాలైన బృహజ్జాతకంలో ఎక్కడా వివరించలేదు. కాని దీనికి విపరీతమైన ప్రాచుర్యం లభించింది. కానీ కాల సర్ప దోషం గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదన్న పండితులూ ఉన్నారు. కాకపోతే కాలసర్ప యోగ ప్రభావం వల్ల అభివృద్ధి ఎంత వేగంగా ఉంటుందో తిరోగమనం కూడా అంటే వేగంగా ఉంటుందనేది మాత్రం కాదనలేని వాస్తవం. జాతకంలో ఉన్న యోగాలు మన కర్మ ఫలాలు మాత్రమే. ఈ యోగాలను మార్చే శక్తి మన కర్మలకు మాత్రమే ఉంటుంది. ఈ జన్మలో మనం అనుభవించే కష్ట సుఖాలు గత జన్మలో మనం చేసుకొన్న కర్మ ఫలాలని పండితులు చెబుతుంటారు.

Updated On 9 Feb 2023 3:11 AM GMT
Ehatv

Ehatv

Next Story