జ్యోతిష వాక్కు ప్రకారం.. కాలసర్ప దోషం వంశపారంపర్యంగా వస్తుందని తెలుసుకున్నాం కదా... కానీ చాలామంది అనుకునేది ఒకటుంది. సర్పాలను చంపడం వల్లనే కాలసర్ప దోషం పడుతుందని. కొంత నిజమే అయినా ఇందుకు చాలా కారణాలే చెబుతారు పండితులు. సర్పాలను తెలిసి గానీ తెలియక గానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా చంపడం చేసినా.. దోషం వదలదు అని నిర్ణయ కౌముది చెబుతుంది. పీడించినా... హింసించినా... బంధించినా... సంహరించినా... ఆ పాపం సర్ప దోషం […]
జ్యోతిష వాక్కు ప్రకారం.. కాలసర్ప దోషం వంశపారంపర్యంగా వస్తుందని తెలుసుకున్నాం కదా... కానీ చాలామంది అనుకునేది ఒకటుంది. సర్పాలను చంపడం వల్లనే కాలసర్ప దోషం పడుతుందని. కొంత నిజమే అయినా ఇందుకు చాలా కారణాలే చెబుతారు పండితులు. సర్పాలను తెలిసి గానీ తెలియక గానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అపకారం చేయటం లేదా చంపడం చేసినా.. దోషం వదలదు అని నిర్ణయ కౌముది చెబుతుంది. పీడించినా... హింసించినా... బంధించినా... సంహరించినా... ఆ పాపం సర్ప దోషం రూపంలో మనుషుల్ని పట్టి పీడిస్తుంది. వంశ క్షయానికి సర్ప దోషమే ముఖ్య కారణం. అంతేకాదు.. గురువులు, ముసలి వాళ్లు, పిల్లలు, స్త్రీలు, గోవులు పశుపక్షులు, పిల్లుల పట్ల మనం చేసే అపరాధం కూడా ఈ దోషం రూపంలో పీడిస్తుంది. అంటే ధర్మ హీనమైన హింసా ప్రవృత్తితో ఇతర జీవాలపై మనం చేసే సమస్త కర్మలు సర్ప శాప స్థితి ద్వారా అమలవుతాయని అంటారు. కర్త అంటే చేసేవాడు, కర్మ అంటే ఫలితానికి కారణమైన వాడు, ప్రేరక అంటే ప్రేరేపించినవాడు.... అనుమోదక అంటే ఆమోదించినవాడు... ఇలా ఈ నలుగురు పాపం అయినా పుణ్యం అయినా సమానంగా అనుభవిస్తారట.
సంతాన హీనతకు, గర్భ శోకానికి, గుణ, రూప హీనులైన సంతానానికి, భర్త హీనతకి, సంసార దుఖానికి, ఈ కాల సర్ప దోషమే కారణం. రోగాలకి, అశాంతికి, అభద్రతకి చంచలమైన, స్థిరత్వం లేని జీవితం అనుభవించడం కూడా ఈ దోషమే వల్లే. వివాహం కాకపోవడం, పెళ్లయినా దంపతులు త్వరగా విడిపోవడం బాల వైధవ్యం రావడం, దాంపత్యంలో కలహాలు చోటుచేసుకోవడం, అన్యోన్యత లోపించడం కూడా కాలసర్ప దోష ఫలితమే. ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే.... జాతకంలో ఉండే అన్ని దోషాల కన్నా ప్రధానమైనదీ ప్రమాదమైనదీ కూడా ఈ కాల సర్ప దోషమే.
కాలసర్పదోషం వల్ల నష్టమెవరికి?
కాలసర్పదోషం ఉన్న జాతకుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది. వీరి మిత్రులు, సహచరులు వీరికన్నా తక్కువ స్థాయి వారూ వీరిని దాటి ముందుకు వెళ్తారు కానీ వీరు మాత్రం ప్రతిభా పాటవాలు ఉన్నా అక్కడే ఉండిపోతారు. మరి దీని నివారణకు పూజలు చేస్తే సరిపోతుందా? దీనికి సరైన పుణ్యస్థలం శ్రీకాళహస్తేనా? అక్కడ గర్భగుడికి దగ్గరగానో... సామూహికంగా పూజలు చేస్తే సరిపోతుందా? అందరూ ఇలాగే అనుకోని తప్పు చేస్తుంటారు. గుండె జబ్బుతో బాధపడే వ్యక్తికి ఒక మాత్ర ఇస్తే సరిపోదు. బైపాస్ చేయించడమే సరైన చికిత్స. అలాగే ఈ దోషానికి కూడా కాలసర్ప శాంతి అనే పూర్తి ప్రక్రియను చేయడమే అసలైన మార్గం. అలా శాంతి చేయించిన తరువాత శ్రీకాళహస్తి వెళ్లి అక్కడ రాహు, కేతు పూజ చేయించడంతో సమాప్తం అవుతుంది.
కాల సర్ప దోషం పోవావాలంటే సశాస్త్రీయంగా శాంతి విధానం చేసుకోవాలి. ఇది మూడు రోజులు లేదా ఒకరోజు గానీ చేసుకోవచ్చంటుంది జ్యోతిషశాస్త్రం. గణపతి పూజ, పుణ్యాహవాచనం పంచగవ్య ప్రాశనం చేయాలి. రాహువు 18 వేలు జపం, కేతువు 7 వేలు జపం, నక్షత్ర జపం, సర్ప మూల మంత్రం, లక్ష్మీగణపతి మూల మంత్ర జపం చేసి వాటికి దశామ్షంలో గోక్షీర తర్పణం చేయాలి. సప్తశతీ పారాయణం, సర్పసూక్త పారాయణం విధిగా ఆచరించాలి. మండపారాధనలో నవగ్రహ ఆరాధన, నవ నాగదేవతా ఆరాధన, మానసాదేవి ఇష్టదేవతా కులదేవతా రుద్ర ప్రధాన కలశాల స్థాపన చేసి వేదోక్తంగా పూజించాలి. రాహువుకి గరిక, వినుములతో, కేతువుకి దర్భ, ఉలవలతో హోమం చేసి ఆవాహిత దేవతలకి ఆవు నేయితో హవిస్సు ఇవ్వాలి. పూర్ణాహుతి చేశాక మండపం ఉద్వాసన చేసి మినుములు కిలో, ఉలవలు కిలో, సర్ప ప్రతిమలు 2 కలిపి దక్షిణతో దానం చేసి... మంత్రయుక్తంగా స్నానం చేయించాలి