కార్తీక మాసం(Karthika masam)... ఆకాశదీపం(Aakasha deepam).
కార్తీక మాసం(Karthika masam)... ఆకాశదీపం(Aakasha deepam). ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందంటున్నారు. గుడుల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు.
శివుడికి(Lord shiva), విష్ణుమూర్తికి(Vishnu) ఎంతో ప్రీతిపాత్రమైనది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి(Karthika pournami) శివరాత్రితో(Shiv ratri) సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవదీపావళి అని కూడా అంటారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు. ఈ ఆకాశదీపం శివకేశవుల తేజస్సును జగత్తుకు అందిస్తుంది. దీపాన్ని వెలిగిస్తూ “దామోదరమావాహయామి” , “త్రయంబకమావాహయామి” అంటూ శివకేశవులను ఆహ్వానిస్తారు. కొన్ని చోట్ల, శివకేశవుల పేర్లతో రెండు దీపాలు వెలిగిస్తారు. ఈ దీపం సమాజంలో చీకటిని తొలగించి, ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వలించే చిహ్నంగా భావించబడుతుంది.
సంవత్సరం పాటు మనం దేవతార్చన చేస్తాం. శాస్త్రం ప్రకారం ఉదయం తప్పనిసరిగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి. ఇలా చేయడం ద్వారా బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులను ఆరాధించినట్లు అవుతుంది. సూర్యుడు ఉన్నంతసేపు మనకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడే. కానీ సూర్యుడు రాకముందు దీపారాధన చేస్తే ఆ ఇంటిలోకి మహాలక్ష్మి ప్రవేశిస్తుంది. ఇలా దీపారాధన చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షంతో కళకళలాడుతుందని ఆ పురాణాల్లో ఉంది. భగవంతుడు అంటేనే పంచభూతాత్మకుడు. ప్రాణులను కూడా సద్భావంతో చూడాలని మనం ఆకాశ దీపం వెలిగిస్తుంటాం. ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం ద్వారా పక్షులు కూడా రాత్రి సమయంలో తమ గమనాన్ని తెలుసుకుంటాయి. రాత్రి సమయంలో గాల్లో ఎగిరే పక్షులు మనం వెలిగించే దీపా కాంతిని గ్రహించి పక్షులు కూడా తమ గమనాన్ని తెలుసుకుంటాయి కాబట్టి భూతదయ కలగాలని చెప్పి మనం ఆకాశదీపం వెలిగిస్తున్నాం.
ఆకాశ దీపాన్ని కేవలం గుడిలోనే కాదు ప్రతి ఇంటిలో వెలిగించాలి. గుడిలో అయితే ఎత్తులో ధ్వజస్తంభానికి దీపాన్ని వెలిగిస్తారు. కానీ మనం ఇంటి బయట ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా దీపాలను వెలిగించి రాత్రి సమయంలో వెలుగులు ప్రసాదిస్తున్నాం కాబట్టి పక్షులు కూడా ఆనందిస్తాయి. వేసవికాలం సమయంలో పక్షులకు దాహం తీర్చడం కోసం మనం ఇంటి బయట చిప్పల్లో ఇతర పాత్రల్లో నీరు పోసి వాటి దాహాన్ని తీర్చుతున్నాం. అదేవిధంగా ఈ మాసంలో వెలిగించే దీపాల్లో ఉండేటటువంటి ఉత్తేజమైన శక్తిని పక్షులు కూడా ఆస్వాదిస్తాయి.
నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు.ఆకాశ దీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు.సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. కార్తీకమాసం ప్రారంభంతో మొదలు ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తంబం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీకమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం.
ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు.ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు.ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు.మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ దామోదరమావాహయామి అనిగాని, త్రయంబకమావాహయామ అనిగాని అని ఆ దీపంతో వెలిగించాలి.ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. పూర్వకాలంలో రవా ణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ.రోజుల్లో బాటసారు ల కోసం ఆకాశదీపాన్ని పెట్టేవారని తెలుస్తోంది. కాలినడకన వచ్చే బాటసారులు ఆకాశదీపాన్ని చూడటంతో అక్కడ ఒక దేవాలయం ఉందని సమీపంలోనే ఒక గ్రామం ఉంటుందని, రాత్రి సమయంలో ఆ గ్రామంలో తలదాచుకొని మరునాడు వారి ప్రయాణాన్ని కొనసాగించేవారని తెలుస్తోంది. ముఖ్యం గా ఆకాశ దీపాలు ప్రదూష వేళల్లో వెలిగించిన తరువాత వాటిని దర్శించుకొంటే సకల దోషాలు,పాపాలు దూరమవు తాయని నమ్మకం.అలాగే ఆవునేతితో దీపాలు పెట్టడం వల్ల కూడా పర్యావరణ సమతుల్యత ఏర్పడుతుందని పెద్దలు చెప్తున్నారు.