దీపం(Deepam) జ్యోతి పరబ్రహ్మ... దీపం సర్వ తమోపహమ్..దీపేన సాధ్యతే సర్వమ్. దీపం పరబ్రహ్మ స్వరూపమంటారు పెద్దలు. మనో వికాసానికి, ఆనందానికి, సుఖ శాంతులకు, సద్గుణానికి దీపం ప్రతీక. హిందువులు ఉదయాన్ని నిద్రలేచి శుచిగా స్నానం చేసి దేవుడికి పూజలు చేస్తారు. ఇందులో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ శుభకార్యం జరిగినా మొదట దేవుడికి దీపం వెలిగిస్తాము. మంగళహారతిలోనూ దీపం తప్పనిసరి. దీపం వెలిగించకుండా ఏ పూజ చేయం.
దీపం(Deepam) జ్యోతి పరబ్రహ్మ... దీపం సర్వ తమోపహమ్..దీపేన సాధ్యతే సర్వమ్. దీపం పరబ్రహ్మ స్వరూపమంటారు పెద్దలు. మనో వికాసానికి, ఆనందానికి, సుఖ శాంతులకు, సద్గుణానికి దీపం ప్రతీక. హిందువులు ఉదయాన్ని నిద్రలేచి శుచిగా స్నానం చేసి దేవుడికి పూజలు చేస్తారు. ఇందులో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏ శుభకార్యం జరిగినా మొదట దేవుడికి దీపం వెలిగిస్తాము. మంగళహారతిలోనూ దీపం తప్పనిసరి. దీపం వెలిగించకుండా ఏ పూజ చేయం. అలా చేసినా ఆ పూజకు పరమార్థం ఉండదు. అయితే దీపం వెలిగించాలంటే కొన్ని నియమాలు(Regulations) ఉన్నాయి. ఎలా పడితే అలా దీపాన్ని వెలిగించకూడదు. పూజ చేస్తున్నప్పుడు వెలిగించే దీపపు కుందులు(Lamps) లేదా సెమ్మెలు శుభ్రంగా ఉండాలి. దెబ్బ తిన్న కుందులను అసలు ఉపయోగించకూడదు. పూజ ముగిసే లోపు దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే దీపపు సెమ్మెలో తగిన మోతాదులో నూనె కానీ నెయ్యి కాని ఉందా లేదా చూసుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు పూజ దీపం మినహా ఇతర ధూపదీపాలు వెలిగించకూడదు(agarwood stick). పూజ చేస్తున్నప్పుడు నెయ్యి(Ghee) దీపం వెలిగిస్తే మరో నూనె దీపం వెలిగించకూడదు. దీపాన్ని పూజా స్థలం మధ్యలో దేవీదేవతల విగ్రహం ముందు ఉంచాలి. నెయ్యి దీపం వెలిగిస్తే మీకు ఎడమవైపు, నూనె దీపం వెలిగిస్తే మీకు కుడివైపు ఉంచాలి. పూజాస్థలంలో దీపాన్ని పడమర దిశలో ఎప్పుడూ పెట్టకూడదు. నూనె దీపంలో ఎర్రటి వత్తిని వినియోగించడం శుభప్రదం. ఇంటి దీపానికి దూది ఉపయోగించవచ్చు.