ఆలయంలో అద్భుతం .కలియుగంలో జరిగే అనేక అద్భుతాల ద్వారా దేవుడు ఉన్నాడు అనడానికి అనేక చోట్ల అనేక ఆశ్చర్యకరమైన దృశ్యాలు బయట పడుతుంటాయి. ఒక శివాలయంలో పాము శివలింగానికి చుట్టుకొని ఉండటం,బాబా ప్రతిమను నుండి విభూతి రాలటం ,కోతి ఆంజనేయస్వామి గుడిలో ప్రదిక్షణలు చేయటం ,వినాయకుడు పాలు తాగడం లాంటి ఎన్నో వింతలు గతంలో మనం విన్నవే .తాజాగా నిర్మల్ జిల్లాలో ఇలాంటి ఆశ్చర్యపడే ఘటన ఒకటి ఆంజనేయస్వామి గుడిలో జరిగింది .

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని శ్రీ వీరహనుమాన్ ఆలయంలో ని జరిగిన అద్భుతం స్వామి వారు ఉన్నారనటానికి నిదర్శనంగా భావిస్తున్నారు. ఎప్పటిలాగానే రోజు వారి పూజను ముగించిన అర్చకులు చివరిగా హారతినిచ్చి హారతిని అక్కడున్న భక్తులకు చూపించిన తర్వాత హారతి పళ్లెంను దేవుడు ముందుపెట్టేసాడు . దేవుడు ముందు ఉంచిన ఆ హారతి ఎవరి ప్రమేయం లేకుండానే 4 నిమిషాల పాటు తనంతట తానే అలా కదులుతూనే ఉంది. ఇది ప్రత్యక్షంగా చూసిన కొంత మంది భక్తులు ఆ దృశ్యాన్ని వీడియో తీశారు . ఇంటర్నెట్ లోని ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఇదంతా స్వామి వారి మహిమే అని భక్తులు కొనియాడుతున్నారు . గతంలో ఇలాంటి వింతలు ఎప్పుడు చూడలేదని ఇది ఖచ్చితంగా స్వామి వారు ఉన్నారనేదానికి నిదర్శనం అని చెపుతున్నారు ఆలయ సిబ్బంది .