చాలామందికి కూర్చున్నప్పుడు కాళ్లు ఊపడం అనేది మాములు అలవాటు కానీ ఇది చాల చెడ్డ అలవాటు అని చెబుతున్నారు జోతిష్య నిపుణులు . జ్యోతిష్యంశాస్త్ర ప్రకారం ఎక్కువుగా పాదాలను ఊపడం ,కదిలించటం అశుభం . ఇంట్లో పెద్దవాళ్ళు తరచు ఆడపిల్లలకు చెప్పే మాట ఇది . కాళ్ళు ఊపకు !అలా చేస్తే లక్ష్మి దేవికి కోపం అని అంటుంటారు . నిజానికి ఇది శాస్త్ర పరంగా మాత్రమే కాదు సైంటిఫిక్ గా కూడా దోషంగా పరిగణింపబడుతుంది . ఇది ఆరోగ్యం ఇంకా సంపదకు సంబంధించిన విషయంగా చెప్పడం జరిగింది . దాని వలన కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్లుఊపడం అనేది మంచి అలవాటు కాదు, జ్యోతిషశాస్త్రంతో దీనికి లోతైన సంబంధం ఉంది. గ్రంధాల ప్రకారం, ఎత్తైన ప్రదేశాలలో అంటే మంచం, కుర్చీ, మొదలైన వాటిపై కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు కాళ్ళను ఊపడం వల్ల జాతకంలో చంద్రుడు బలహీనంగా మారుతాడు . అలాంటప్పుడు , చంద్రుని ప్రభావం జాతకంలో చెడు పరిణామాలు కలిగేలా చేస్తుంది . దీనితో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలతో పాటు ,ఆర్థిక నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి .

చంద్ర గ్రహ దుష్ప్రభావాల కారణంగా, జాతకపరంగా ఏ పని చేసిన ప్రశాంతత ఉండదు , ఆరోగ్య ఇబ్బందులు , ఆర్థిక సంక్షోభంతో బాధపడతారు . డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది.కూర్చున్నప్పుడు కాళ్ళను ఊపడంతో లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుంది. ఇలాంటి వారి ఇంటిలో దరిద్ర దేవత తిష్ఠ వేసుకొని కూర్చుంటుంది .

భోజనం చేసేటప్పుడు కూడా కొంతమందికి కాళ్ళు కదిలించే అలవాటు ఉంటుంది . ఇలాచేస్తే సాక్షాత్తు అన్నపూర్ణ మాతను అవమానించటం అవుతుందట . అందుకే పెద్దలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను కదిలిస్తే తిడతారు . దీంతో లక్ష్మిదేవికి కోపం వచ్చి కుటుంబమంతా డబ్బు, ధాన్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది .పూజలో కూర్చున్నప్పుడు కాళ్ళను కదిలించడం వల్ల చేసే పూజలు ఇంకా ఉపవాసాలు పనికిరావు అని పండితులు చెప్పడం జరిగింది .

వైద్య శాస్త్రంలో కూడా, కాళ్ళు ఊపడం ఆరోగ్య పరంగా కూడా మంచిది కాదు అని చెపుతున్నారు . వైద్య శాస్త్రంలో, కాళ్లు కదిపే అలవాటుని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్‌గా అభివర్ణించారు ఇది తీవ్రమైన వ్యాధిగా చెప్పబడుతుంది . ఈ వ్యాధి కారణంగా గుండె, కిడ్నీ, పార్కిన్సన్స్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు

Updated On 28 April 2023 1:34 AM GMT
rj sanju

rj sanju

Next Story