షడ్రుచుల సమ్మేళనం (తీపి ,పులుపు,వగరు, కారం, చేదు, ఉప్పు)సమ రుచులతో తయారు చేసే పచ్చడితో వచ్చే కొత్త రుచి ఆస్వాదిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే పండుగ ఉగాది. సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టినిప్రాంభించారని విశ్వాసం .ఆ నమ్మకం వల్ల నే కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజును ఉగాది అని పిలుచుకుంటున్నాం . ఉగాది వెనుక గల పూరణ కథ ను తెల్సుకుందాం.

షడ్రుచుల సమ్మేళనం (తీపి ,పులుపు,వగరు, కారం, చేదు, ఉప్పు)సమ రుచులతో తయారు చేసే పచ్చడితో వచ్చే కొత్త రుచి ఆస్వాదిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే పండుగ ఉగాది. సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టినిప్రాంభించారని విశ్వాసం .ఆ నమ్మకం వల్ల నే కొత్త సంవత్సరం ప్రారంభం అయిన రోజును ఉగాది అని పిలుచుకుంటున్నాం . ఉగాది వెనుక గల పూరణ కథ ను తెల్సుకుందాం.
బ్రహ్మ దేవుడు సృష్టిని మొదలుపెట్టేముందు సోమకాసురుడనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రం లో దాక్కుంటాడు . బ్రహ్మ చేసేది లేక విష్ణువు సహాయం కోసం అడుగగా శ్రీ మహా విష్ణువు మత్స్య అవతారంలో సోమకాసురుడిని సంహరించి చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వేదాలను బ్రహ్మ వద్దకు చేర్చగా ఆ రోజు నుండే బ్రహ్మ సృష్టి ని మొదలు పెట్టాడు అనేది పూరణ కథనం .

వసంత రుతువు ప్రారంభమయ్యే వేళలో చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.తిథి , వార, నక్షత్ర.యోగం, కరణాలను అనే ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం.ఈ రోజు తప్పకుండ పంచాంగ శ్రవణం చేయాలనీ చెబుతారు .

ఈ పండుగను మహారాష్ట్ర గుడిపడ్వా గ జరుపుకుంటారు. ఇంకా వేరు వేరు ప్రాంతాల్లో ఉగాది ని వేరు వేరు సంప్రదాయాల్లో జరుపుకుంటూ ఉంటారు .తమిళులు 'పుత్తాండు' అనే పేరుతో, మలయాళీలు 'విషు' అనే పేరుతో, సిక్కులు 'వైశాఖీ'గా, బెంగాలీలు 'పోయ్ లా బైశాఖ్' గా జరుపుకుంటారు. శాలివాహన శకం ప్రకారమన్నమాటఉగాది రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడమే కాకుండా ప్రత్యేక వంటకాలను నైవేద్యం పెడతారు. పండుగ రోజు తెల్లవారుఝామునే లేని తలస్నానాలు చేసి, పూజ చేస్తారు. ఆయురారోగ్యాలు, సంపదలతో తమ ఇళ్లు తులతూగాలని దేవతకు మొక్కులు మొక్కుకుంటారు.

ఉగాది అనగా “ఉ” అంటే నక్షత్రము అని , “గా “అనగా గమనం అంటే నక్షత్ర గమనము ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభం అవుతుంది అని చెప్పుకుంటాం.యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము.యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము.అనాదిగా సంప్రదాయంలో తెలుగు వారి నూతన సంవత్సరంగా ఈ రోజు వేడుకలను జరుపుకుంటున్నాం .

Updated On 17 March 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story