ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది పండుగా మార్చి 22 న జరుపుకుంటున్నాం . ప్రతిపాద తిథి మార్చి 21, 2023న రాత్రి 10:52 గంటలకు ప్రారంభమవుతుంది ,ప్రతిపాద తిథి మార్చి 22, 2023న రాత్రి 08:20 గంటలకు ముగుస్తుంది.ఈ ఉగాది తెలుగు వారికీ ముఖ్యమైన పండుగల్లో మొదటిది ఉగాది . బ్రహ్మ దేవుడు వసంత ఋతువులో మొదటిసారి ఈ రోజుని సృష్టిని చేయడం ప్రారంభించాడన్న విషయం తెలిసిందే . గణాలు,నక్షత్ర ,గ్రహగమనాలు,కాలమానం ని అనుసరించి వివరించే […]
ఈ ఏడాది కొత్త సంవత్సరం ఉగాది పండుగా మార్చి 22 న జరుపుకుంటున్నాం . ప్రతిపాద తిథి మార్చి 21, 2023న రాత్రి 10:52 గంటలకు ప్రారంభమవుతుంది ,ప్రతిపాద తిథి మార్చి 22, 2023న రాత్రి 08:20 గంటలకు ముగుస్తుంది.ఈ ఉగాది తెలుగు వారికీ ముఖ్యమైన పండుగల్లో మొదటిది ఉగాది . బ్రహ్మ దేవుడు వసంత ఋతువులో మొదటిసారి ఈ రోజుని సృష్టిని చేయడం ప్రారంభించాడన్న విషయం తెలిసిందే . గణాలు,నక్షత్ర ,గ్రహగమనాలు,కాలమానం ని అనుసరించి వివరించే పంచాంగ శ్రవణం ఉగాది పర్వదినం రోజున తప్పనిసరి.
ఉగాది ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలి . ఉగాది రోజున పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఇళ్లను అలంకరించుకోవాలి. కొత్త బట్టలు ధరించాలి .రంగుల ముగ్గులతో వాకిళ్ళను అలంకరించాలి. ఉగాది రోజున ముఖ్యమైన పనులను ప్రారంభించుకోవచ్చు. గుమ్మానికి పచ్చని మామిడి తోరణాలను ,గడపకు పసుపును అలంకరించుకోవాలి. కొత్త ఆశలతో ,కొత్త ఆశయాలతో,కొత్త ఉత్సాహం తో ,ఆనందం తో ఆహ్వానిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాలి. ప్రతి మనిషి జీవితం లో ఉండే తీపి చేదు ల కలయికల గుర్తుగా కొత్త చిగురాలను తొడిగేలా షడ్రుచుల ఉగాది పచ్చడిని కలుపుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లోవాళ్ళు తినాలి. ఉగాది పచ్చడి లో తీపి,పులుపు,కారం,వేపచిగుళ్ల చేదు ,వగరు,ఉప్పు ఆరు రుచుల సమ్మేళనం తో తయారు అయ్యే పచ్చడిని రుచి చూసి తీరాలి.ప్రధానంగా తొలిపూతతో తయారు అయ్యే మామిడి ,వేప చిగుళ్లు పచ్చడి తయారీలో ప్రాధాన్యం సంతరించుకొని కొత్త రుచి అందిస్తాయి .
ఉగాది రోజు నుండి అంటే చైత్రశుక్ల పాడ్యమి నుండి చైత్రశుక్ల నవమి వరకు చైత్ర నవరాత్రాలు మొదలు అవుతాయి.ఈ నవరాత్రులు అత్యంత పవిత్రమైనవి. ఈ తొమ్మిది రోజులు దుర్గ దేవి ఆరాధన చేయాలి. పాడ్యమి రోజున కలశ స్థాపన చేసి తొమ్మిది రోజులు ఉదయం సాయంకాలం అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో పూజించి స్తోత్రాలతో అమ్మవారిని స్తుతించాలి అమ్మవారు స్తోత్ర ప్రియురాలు .అందుకే అమ్మవారి స్తోత్రాలు పాటించటం ద్వారా ఆమె మనకు ఎపుడు రక్షగా ఉంటారు.నవరాత్రుల్లో ఎర్రటి పూవ్వులు ,కుంకుమ ,ఎర్రనిగాజులు,ఎర్రని అక్షింతలుతో అమ్మవారిని పూజించటం శ్రేష్టం.అలాగే ఉగాది పర్వదినాన లక్ష్మి దేవి పూజ అత్యుత్తమం .లక్ష్మి దేవిని అష్టోత్తరాలతో ,గంధం ,కర్పూరం,ఆగరు ధూపాలతో ,పూజించటమే కాకుండ వెండి లేదా బంగారు వస్తువులను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మి యోగం సిద్ధిస్తుంది.అలాగే ఉగాది రోజున లక్ష్మి పూజ చేసేవాళ్ళు పసుపుకొమ్ములను ,లేదా పసుపును ,కుంకుమను రాశులుగా అమ్మవారి ముందు ఉంచి మనసులో కోరికను చెప్పుకున్నట్లు అయితే తప్పక నెరవేరుతుందని పూరణ కధనం.