"ఉగస్య "అది అనేదే ఉగాది ఉగ అనగా నక్షత్ర గమనము నక్షత్ర గమనానికి అది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగము అనగా ద్వయము లేదా జంట అని అర్ధము ఉత్తరాయణము -దక్షిణాయనము ద్వయ సంయుతము యుగము కాగా ఆ యుగానికి అది ఉగాదిగా మారినది యుగాది శబ్దానికి ప్రతి రూపముగా ఉగాదిగా రూపొందినది

షడ్రుచుల సమ్మేళనముగా చేసే ఈ పచ్చడి జీవితములో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తున్నది జీవితములో అన్ని భావనలను చెప్పే భావము ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్ధము ఒక్కో భావానికి అనుభవానికి ప్రతీక

బెల్లము =తీపి --ఆనందానికిప్రతీక

ఉప్పు =జీవితములో ఉత్సాహము రుచికి సంకేతము

వేపపువ్వు =చేదు -భాధ కలిగించే అనుభవాలు

చింతపండు =పులుపు -నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు

పచ్చి మామిడిముక్కలు -వగరు కొత్త సవాళ్లు

కారము =సహనము కోల్పేయేటట్లు చేసే పరిస్థితులు.

ehatv

ehatv

Next Story