తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు కొండమీదకు వస్తారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి రోజూ వేలాది మంది భక్తులు కొండమీదకు వస్తారు. మొక్కు ఉన్న వారు కాలినడకన కొండెక్కుతారు. ఇలా శ్రీవారిని దర్శించుకోవడానికి నడకదారిలో(alipiri Steps) వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది.

శ్రీ‌వారి మెట్లు, అలిపిరి మార్గాల ద్వారా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శ్రీ‌వారి మెట్టు మార్గం ద్వారా న‌డిచి వెళ్లే భ‌క్తుల‌కు ప్ర‌తి రోజూ మూడు వేల టికెట్ల‌ను(Dharshan tickets) జారీ చేస్తున్నారు. ఇకపై శ్రీ‌వారి మెట్టుమార్గంలో 4 వేలు, అలిపిరి మార్గం ద్వారా వెళ్లే న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు 6 వేలు టికెట్లు జారీ చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది. నిజానికి నడకదారి భక్తులకు టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో టీటీడీ కొన్ని సంస్కరణలు చేపట్టింది. కొన్ని నిర్ణయాలు ప్రజలకు నచ్చుతున్నాయి. కొన్నేమో విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఆధార్‌కు కేవలం రెండు లడ్లు(Laddu) మాత్రమే ఇస్తామనే టీడీపీ నిర్ణయాన్ని తప్పుపడుతుంటే నడకదారి భక్తులకు టికెట్లు ఇవ్వడాన్ని మెచ్చుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story