భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులకు విక్రయిస్తోంది.

భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో భక్తులకు విక్రయిస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు, టేబుల్-టాప్-క్యాలెండర్‌లు, డీలక్స్ డైరీలు, చిన్న డైరీలను, శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్దసైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా టీటీడీ ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, ఇతర ప్రధాన కల్యాణమండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి ఇంటి వద్దే టీటీడీ డైరీలు, క్యాలండర్లను పొందే సౌలభ్యం గతంలో లాగానే ఉంది. టీటీడీ క్యాలెండర్ లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్ ద్వారా www.tirumala.org, ttdevasthanams.ap.gov.in ఆన్ లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసేందుకు కల్పించారు. సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ehatv

ehatv

Next Story