వినాయకచవితి(Vinayaka chathurthi) పండుగ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి.

వినాయకచవితి(Vinayaka chathurthi) పండుగ సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. వీధివీధినా మండపాలు వెలిశాయి. మండపాలలో కొలువు తీరడానికి వినాయక మూర్తులు తరలివెళుతున్నాయి. గణపతి బొమ్మల అమ్మకాలు జోరందుకున్నాయి. విఘ్నేశ్వరుడి గుళ్లు గోపురాలకు కొత్త కళ వచ్చింది. విద్యుద్దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అదలా ఉంచితే ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన గణనాథుడికి మూడు తొండాలు ఉండటం ఎప్పుడైనా విన్నారా? చూశారా..? చూడలేదా? అయితే పుణెకు(Pune) వెళ్లాల్సిందే. అక్కడ త్రిసూంద్‌ గణపతి ఆలయం(trishund ganpati temple) ఉంది. అందులో మూడు తొండాలతో(Trunk) ఉన్న గణపతిని దర్శించుకోవచ్చు.

పుణెలోని సోమ్వర్‌పేట దగ్గరుంది త్రిసూంద్‌ గణపతి ఆలయం.. నజగిరి నదీ తీరంలో వెలసిన ఈ వినాయకుడి దర్శనం కోసం దూరతీరాల నుంచి భక్తులు వస్తుంటారు. భీమజీగిరి గోసవి అనే ఆయన 1754లో ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలు పెట్టారు.. పదహారేళ్ల తర్వాత గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మరెక్కడా చూడని విధంగా ఇక్కడి వినాయకుడికి మూడు తొండాలు.. ఆరు చేతులు ఉంటాయి.. పైగా నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడు.. ఇదే కాదు.. ఈ ఆలయంలో ఇంకా చాలా చాలా విచిత్రాలున్నాయి.. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి.. ఆలయ ప్రాంగణంలో అనేక దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి.. ఏనుగులు.. గుర్రాల వంటి జంతువుల విగ్రహాలు సరేసరి! వీటితో పాటు ఆలయంలోని ఓ గోడ మీద అమెరికన్‌ సైనికుడొకరు ఖడ్గమృగాన్ని ఇనుప గొలుసుతో కడుతున్నట్టుగా ఓ విగ్రహాన్ని చెక్కారు. అంతేనా... గర్భగుడి గోడల మీద ఉన్న మూడు శాసనాల్లో రెండు సంస్కృతంలో ఉంటే.. ఒకటి పెర్షియన్‌ భాషలో ఉంది.. ఆలయాన్ని నిర్మించిన గోసవి సమాధి కూడా ప్రాంగణంలో ఉండటం విశేషం..

Eha Tv

Eha Tv

Next Story