రేపు మహాలయ అమావాస్య(Pettamavasya). పెత్తరమావాస్య అని కూడా అంటారు.
రేపు మహాలయ అమావాస్య(Pettamavasya). పెత్తరమావాస్య అని కూడా అంటారు. బుధవారంతో పితృపక్షాలు(Pitru Paksha) ముగుస్తాయి. రేపటి రోజుకు హిందూ సంప్రదాయంలో(Hindu tradition) చాలా విశిష్ట స్థానం ఉంది. పితృదేవతలకు తృప్తికలిగేందుకు క్రతువులు చేస్తారు. మానవ పరిణామ క్రమంలో క్రమంగా జంతువుల నుంచి మానవుడు ఏర్పడుతూ వచ్చాడు. మనిషిగా పరిణామం చెందూతు ఉన్న క్రమంలో రకరకాల కొత్త కొత్త విషయాలను ఆవిష్కరిస్తూ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా జీవించడం నేర్చుకున్నాడు. మనం ఈ రోజున ఇన్ని సౌకర్యాల నడుమ ఇంతటి అందమైన, సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నామంటే అందుకు కారణం మన పూర్వీకుల జిజ్ఞాస, వారి కృషి తప్పకుండా ఉందని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈరోజు మనం ఆనందిస్తున్న అన్ని వస్తువులూ వారి ఆవిష్కరణలే అయినపుడు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం, ఆ భావాన్ని వ్యక్తం చెయ్యడం మన కర్తవ్యం. వారికి కృతజ్ఞత తెలుపుకునే విధానమే పితృపక్షాల్లో ఆచరించే క్రతువులు. ప్రతీ ఒక్కరూ తప్పకుండా ఈ పితృపక్షకాలంలో పూర్వీకులను స్మరించుకుని వారిని తృప్తి పరిచే క్రతువులు తప్పక నిర్వహించాలి. ఈ పక్షం రోజులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వర్తించలేకపోయినా అమావాస్య రోజునైనా ఈ కార్యక్రమం పూర్తిచెయ్యాలని శాస్త్రం చెబుతోంది.