ఈ రోజు ఆండాళ్ అమ్మవారి(Godess Andal) పుట్టిన రోజు.
నీళా తుఙ్గ స్తనగిరి తటీ సుప్తం ఉద్భోద్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతి శత శిరసిద్ధం అధ్యాపయన్తీ |
స్వోఛి ష్ఠాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదం మిదం భూయ ఏవాస్తు భూయః ||
ఈ రోజు ఆండాళ్ అమ్మవారి(Godess Andal) పుట్టిన రోజు. అందుకనే ఈరోజుని ఆండాళ్ తిరునక్షత్రం అని పిలుస్తారు. కలియుగం ప్రారంభం అయిన 93 వ సంవత్సరంలో ఆండాళ్ తల్లి అవతరించింది. కలియుగం(Kaliyugam) ఆరంభం అయిన తరువాత నర నామ సంవత్సరంలో పూర్వ పాల్గుని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా శ్రావణమాస ప్రారంభమైన తరువాత ఆండాళ్ శ్రీరంగం పట్టణంలో జన్మించారు. గోదా దేవి(Goda Devi) తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి లభించింది. శ్రీవిష్ణుచిత్తుల (పెరియాళ్వార్) ముద్దుబిడ్డగా పెరిగి, ఆండాళ్గా అందరి హృదయాలనూ దోచుకుంది. శ్రుతి, స్మృతుల మూలార్థాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని ఆచరించింది. ఆనాడు గోపికలు అనంత శక్తిస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ‘ప్రియమైన’ చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు. ఆయనను పొందగలిగారు. అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి, నాయికా భావంతో శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి