శ్రావణ శుక్ల పక్ష పంచమి(Sravani panchami) నాగ పంచమితో(Naga ) పాటు గరుడ పంచమి(Garuda panchami) అని కూడా పిలుస్తారు
శ్రావణ శుక్ల పక్ష పంచమి(Sravani panchami) నాగ పంచమితో(Naga ) పాటు గరుడ పంచమి(Garuda panchami) అని కూడా పిలుస్తారు. ఇది సర్ప పూజ ఉద్దిష్టమైన రోజు. భారతావనిలో అనేక ప్రదేశాలలో నాగజాతి వారున్నట్లు చరిత్ర చెబుతున్నది. దేవాలయాల్లో గరుడ వాహనాలను గమనిస్తే, ఒక మోకాలు వంచి, మరో మోకాలు మీద నిటారుగా కూ ర్చొని రెండు చేతులనూ చాచి మూలవిరాట్టును చూస్తూ ఉంటాడు. దాని అంతరార్ధం 'స్వామి నా కర్తవ్య నిర్వహణ కోసం నేను ఏ క్షణంలోనైనా సిద్ధమే' అని!
సర్వశక్తి సంపన్నుడు అయి ఉండీ, సవతి సోదరులను వీపున మోస్తూ, అవమానాలను ఓర్చి, తల్లికీ, తనకూ గల దాస్య బంధనా లను తెంపి, మహావిష్ణువుకు వాహనంగా వినుతికెక్కిన వినతా పుత్రుడైన వైనతేయుడు ప్రాత:స్మరణీయుడు. అలా ఈరోజు నాగుల నుంచి రక్షణ పొంది, నాగదోషం తగులకుండా పిల్లల ను కాపాడుకొనేందుకు, నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లలు పుట్టడం కోసం గరుడ పంచమి నాడు గరుడ పూజ చేయడం ఆచారంగా ఉంది.
ఈరోజు శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం..
సాధారణంగా శుక్రవారాన్ని ఎంతగానో ఇష్టపడే లక్ష్మీదేవి, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుని మరింత ఇష్టపడుతుంది. వేంకటేశ్వరస్వామిది 'శ్రవణా నక్షత్రం' అందువలన ఈ మాసం అంటే అమ్మవారు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపుతుంది. ఈ శ్రావణ మాసపు శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధించడం వలన సకల సంపదలు లభిస్తాయి. అదే విధంగా గోలక్ష్మి (ఆవు)ని పూజించిన వారికి సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ... 'కనకధారా స్తోత్రం' చదువుకున్నట్టయితే, సిరిసంపదలు కలుగుతాయి.