ఈరోజు అంటే అక్టోబర్‌ 30వ తేదీ బుధవారం సూర్యోదయంతో ఆశ్వయుజ(Ashwayuja) బహుళ త్రయోదశి తిథి ఉంది.

ఈరోజు అంటే అక్టోబర్‌ 30వ తేదీ బుధవారం సూర్యోదయంతో ఆశ్వయుజ(Ashwayuja) బహుళ త్రయోదశి తిథి ఉంది. కాబట్టి ఈ రోజునే ధన్వంతరి జయంతిని(Dhanvantari Jayanti) జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభసమయం. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. జీవితంలో ఎంత ఐశ్వర్యమున్నా ఆరోగ్యం లేకుంటే ఏదీ అనుభవించలేము. షడ్రసోపేతమైన భోజనం కళ్ళెదురుగా ఉన్నా, ఒంట్లో అనారోగ్యం(Unhealthy) ఉంటే ఏమి ఫలం చెప్పండి? అందుకే ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవాలను పూజించడం హిందూ సంప్రదాయంలో ఒక భాగం. క్షీరసాగర మథన సమయంలో అమృత భాండ కలశంతో పాలసముద్రం నుంచి ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు అవతారమే ధన్వంతరి. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. కాబట్టి ఆ రోజును మనం ధన్వంతరి జయంతిగా జరుపుకుంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం(Ayurvedham) నేర్చుకొన్న ధన్వంతరి, సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడని తెలుస్తోంది. ముఖ్యంగా మన శ్రీ రంగగిరి క్షేత్రంలో "ధన్వంతరి స్వామి" వేంచేసి ఉన్నాడు.ఇక్కడ ప్రతి అమావాస్య రోజున ధన్వంతరి హోమాలు జరుగుతుంటాయి.. ఎంతో మంది వ్యాధి నివారణకు, మంచి ఆరోగ్యానికి దేవుడిని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు..

Eha Tv

Eha Tv

Next Story