వైయత్తు వాళ్ వీర్గాళ్!
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్ శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్ ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టిvఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
మనిషి బాగుపడడానికి ఎన్నో మార్గలు. శాస్త్రాలు అవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తియోగమని ఇలా ఎన్నో మన పెద్దలు చెప్పారు. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మార్గశిర్షంలో పయనిస్తారు అని అంటారు. మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో. ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాశురములో!