శ్రీవారిని దర్శించుకున్న తరువాత చూడవలసిన ప్రాంతాల్లో అతి ప్రాచీనమైన తంబుర తీర్థం కూడా ఒకటి . నిజానికి తంబురా తీర్థం గురించి చాల తక్కువ మందికి తెలుసు. పవిత్రమైన తుంబురు తీర్థంలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటే మీ కష్టాలు ,సర్వ పాపాలు హరించిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తుంబురు తీర్థం శ్రీ వారి దేవాలయానికి ఏడున్నరమైళ్ళ దూరం లో ఉంటుంది

తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి నిత్యం లక్షల భక్తులు వస్తూవుంటారు.మనసారా స్వామిని వేడుకుంటే తమ జీవితాల్లో కష్టాలన్నీ పోతాయి అనే నమ్మకం తో స్వామి దర్శనానికి నడకన చేరుకునేవారు వేలల్లో ఉంటారు .ఇలా స్వామి సన్నిధికి చేరి మొక్కులు చెల్లించుకొని స్వామిని దర్శించుకున్నాక చుట్టూ పక్కన ఉన్న ప్రాంతాలను సైతం దర్శించుకుంటు ఉంటారు. కపిలతీర్థం,ఆకాశగంగా ,శ్రీనివాసమంగాపురం,కాణిపాకం వంటి ప్రాంతాలు దర్శించుకుంటారు .

శ్రీవారిని దర్శించుకున్న తరువాత చూడవలసిన ప్రాంతాల్లో అతి ప్రాచీనమైన తంబుర తీర్థం కూడా ఒకటి . నిజానికి తంబురా తీర్థం గురించి చాల తక్కువ మందికి తెలుసు. పవిత్రమైన తుంబురు తీర్థంలో స్నానం చేసి శ్రీవారిని దర్శించుకుంటే మీ కష్టాలు ,సర్వ పాపాలు హరించిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తుంబురు తీర్థం శ్రీ వారి దేవాలయానికి ఏడున్నరమైళ్ళ దూరం లో ఉంటుంది.

పరమ పవిత్రమైన తుంబురుతీర్థంలో ప్రతి ఏడాది ముక్కోటి తీర్థం వైభవంగా జరుగుతుంది. వచ్చే ఏప్రిల్ నెల 6 వ తేదీపౌర్ణమి రోజున తుంబుర తీర్థం లో ముక్కోటి తీర్థం వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి . ఆ రోజు తుంబుర తీర్థం లో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకున్నవారికి విశేష ఫలితాలు కలుగుతాయి అని పురాణాల్లో పేర్కొన్నారు .ప్రతి ఏటా ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొంటారు.

ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడంTTD ఆనవాయితీ.ఈ పర్వదినాన తుంబుర తీర్థస్నానం ఆచరించి, దానధర్మాలు చేసి తిరుమలలో స్వామివారిని శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులు దర్శించుకోవటం పుణ్యంగా భావిస్తారు . ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది . భక్తుల సౌకర్యం కోసం టీ టీ డీ ఉచిత బస్సు ల్లో తుంబుర తీర్థం చేరుకునే ఏర్పాట్లను చేయనుంది.

Updated On 18 March 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story