తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై తిరుమలకు కాలి నడకన వెళ్లే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా సమయంలో టీటీడీ ఈ టోకెన్ల జారీని నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ కాలి నడకన వచ్చే భక్తులకు ఈ దివ్యదర్శన టోకెన్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(Y. V. Subba Reddy)తెలిపారు. అయితే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. మరోవైపు విఐపి బ్రేక్ దర్శనాలు భారీగా కుదింపు చేసామన్నారు . తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన సమీక్షావేశంలో పాల్గొన్న ఛైర్మన్ ఈ విషయాలను వెల్లడించారు. అలిపిరి నడక దారిలో 10 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రానున్న వేసవి సెలవుల్లో(Summer Holidays) భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్న ఆయన తిరుమలలో గదుల కేటాయింపు విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తామని తెలిపారు. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో పారదర్శకంగా వసతి సౌకర్యం కేటాయింపులు చేస్తామన్నారు. వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు చెప్పుకొచ్చారు.