గతమాసం సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామ‌ని.. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది.

గతమాసం సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామ‌ని.. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జ‌రిగింది. ముందుగా ఈవో భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 14న అంకురార్పణ జరుగనుంది. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడసేవ, అక్టోబరు 20న పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబరు 23న చక్రస్నానం నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు.. రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది. భ‌క్తులంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పించేలా రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు ఉంటుందని తెలిపారు.

Updated On 7 Oct 2023 3:08 AM GMT
Ehatv

Ehatv

Next Story