ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి లో శ్రీ రామ నవమి ,శ్రీ రామ పట్టాభిషేకాలను సందర్భంగా ఈ నెల 30,31 తేదీలలో ఘనంగా ఏర్పాట్లు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది . మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మార్చి 31న రాత్రి 8 నుండి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా జరిగే ఉత్సవాలలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.

అలాగే ,ఈ నెల 18 వ తేదీన తిరుపతి శ్రీనివాస మంగాపురం లో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారని,మధ్యాహ్నం 2గంటల నుంచి తులసి, చామంతి, గన్నెరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజ, కలువలు లాంటి పుష్పజాతులతో పుష్పయాగం జరుగుతుంది.వీటితో పాటు స్వామి వారికీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.ఈ పుష్పయాగం సందర్భంగా 18 వ తేదీన నిత్యా కల్యాణ సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది .

Updated On 16 March 2023 11:58 PM GMT
Ehatv

Ehatv

Next Story