తిరుచానూరు(Tiruchanoor ) శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు(Sri Padmavathi Ammavari Brahmotsavam) ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం అనంతరం నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారితో పాటు చక్రాత్తాళ్వార్, గజ చిత్రపటాన్ని మాడవీధుల్లో ఊరేగించారు.
తిరుచానూరు(Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు(Sri Padmavathi Ammavari Brahmotsavam) ధ్వజారోహణంతో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకం అనంతరం నాలుగు మాడ వీధుల్లో తిరుచ్చి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారితో పాటు చక్రాత్తాళ్వార్, గజ చిత్రపటాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గరుత్మంతుని చిత్రం ఉన్న ధ్వజ పటాన్ని ఆరోహణం చేశారు. అమ్మవారి మూర్తికి(Idol) వజ్రకిరీటం(Crown), సహస్ర నామాలు కలిగిన బంగారు లక్ష్మీకాసుల హారం, లక్ష్మీనారాయణ కాసుల హారం అలంకరించారు. శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ తర్వాత అమ్మవారు చిన్నశేష వాహనంలో వెన్నముద్ద కృష్ణుడి(Krishna) రూపంలో మాడ వీధుల్లో విహరించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో కొలువుదీర్చారు. రోజూ ఉదయం అద్దాల మండపం నుంచే అమ్మవారిని తీసుకొచ్చి వాహన సేవలు, ఇతర సేవలు నిర్వహిస్తారు.తొమ్మిదో రోజు పంచమీతీర్థం నాడు రాత్రి అమ్మవారిని సన్నిధిలో కొలువుదీరుస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి వేషధారణలతో ఉండగా, ఇతర విద్యార్థులు పలు అన్నమయ్య సంకీర్తనలకు లయబద్ధంగా సంప్రదాయ నృత్యం చేశారు.లంబాడి నృత్యం, దింసా నృత్యం, కరగం, వీరనాట్యం, భరతనాట్యం, తిరుమొళి నాట్యం, కోలాటం, కేరళ కళాకారుల డ్రమ్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.