తెలుగు పంచాంగం ప్రకారం, ఆశ్వయుజమాసం వచ్చే త్రయోదశి(Dhantrayodashi) తిథినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి(Lakshmi devi) అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం.
తెలుగు పంచాంగం ప్రకారం, ఆశ్వయుజమాసం వచ్చే త్రయోదశి(Dhantrayodashi) తిథినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి(Lakshmi devi) అనుగ్రహం కూడా లభిస్తుందని విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ విలువైన పాత్రలను కొంటారు. ఈ పర్వదినాన బంగారం, వెండితో(silver) పాటు విలువైన ఆభరణాలను(Ornaments) కొని ఇంటికి తెచ్చుకుని పూజలు చేస్తారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడి(Kuberudu) అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. నవంబర్ 10న శుక్రవారం మధ్యాహ్నం 12:35 గంటల నుంచి త్రయోదశి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు నవంబర్ 11 శనివారం మధ్యాహ్నం 1:57 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున మినీ దీపావళి(Mini deepavali) ఉత్సవాల్లో భాగంగా బంగారం, వెండి, ఇతర విలువైన పాత్రలను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే వీటితో పాటు మరికొన్ని వస్తువులను కొనడం వల్ల తమ ఇంట ఆదాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం శ్రేయస్సు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే ఈరోజున విలువైన వస్తువులతో పాటు మరికొన్ని వస్తువులను కొనడం వల్ల పేదరికం నుండి, అప్పుల బాధ నుండి విముక్తి పొందొచ్చు.