హిందూమతంలో ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో శివుడు(God Shiva) ఒకరు. హిందూమతంలో 18 మహాపురాణాలున్నాయి. ఇందులో శివపురాణం(Shiva Puranam) అత్యంత ప్రసిద్ధ గ్రంథంగా ఉంది. ఈ గ్రంథం శివుని కథ, మహిమ, వివిధ రూపాలు, జ్యోతిర్లింగం, కథలను పూర్తిగా వివరిస్తుంది.
హిందూమతంలో ఎక్కువగా పూజించబడే దేవుళ్లలో శివుడు(God Shiva) ఒకరు. హిందూమతంలో 18 మహాపురాణాలున్నాయి. ఇందులో శివపురాణం(Shiva Puranam) అత్యంత ప్రసిద్ధ గ్రంథంగా ఉంది. ఈ గ్రంథం శివుని కథ, మహిమ, వివిధ రూపాలు, జ్యోతిర్లింగం, కథలను పూర్తిగా వివరిస్తుంది. శివ పురాణంలో ఉన్న కొన్ని మంత్రాలను పఠించడం వల్ల శివుడు ప్రసన్నం అవుతాడని.. అతని దయతో మన సమస్యలన్నీ పరిష్కారమవుతాయంటున్నారు. నవగ్రహాలను కూడా శివుడు పరిపాలిస్తాడు. శివుడిని పూజించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోయి జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అయితే మంచి ఆరోగ్య కోసం, కోరికలు నేర్చుకునేందుకు రెండు మంత్రాలను ప్రతి రోజూ పఠించాలని చెప్తున్నారు.
మంచి ఆరోగ్యం కోసం శివ పురాణం ప్రకారం, 'ఓం నమః శివాయ'(Om Namah Shivaya) అనే పవర్ ఫుల్ మంత్రం. ఈ మంత్రాన్ని మనం రోజూ జపించడం వల్ల మన శరీరం రోగాల నుంచి బయటపడుతుంది, మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటున్నారు. ఇక మరో మంత్రం
'ఓం నమో భగవతే రుద్రాయ నమః'(Om Namo Bhagavate Rudraya Namah) అనేది శివుని రుద్ర మంత్రం, ఈ మంత్రాన్ని ప్రతి రోజు పఠిస్తే శివుడి దయతో మన కోరికలు తీరుతాయని చెప్తున్నారు.
ఓం నమః-శివాయ: కేవలం ఐదు అక్షరాల మహత్తర కలయిక అయిన ఈ మంత్రం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చరిత్రలో అతి ఎక్కువ మంది బహుశా ఈ మంత్రంతోనే తమ పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారని చెప్తారు. ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తాయి. 'న' అంటే భూమి, 'మ' అంటే నీరు, 'శి' అంటే అగ్ని, 'వ' అంటే వాయువు, 'య' అంటే ఆకాశం.
'ఓం నమో భగవతే రుద్రాయ నమః' ఓం నమో భగవతే రుద్రాయ నమః మంత్రం శివుడిని ఆరాధించే శక్తివంతమైన మంత్రం. మంత్రం 10 అక్షరాలను కలిగి ఉంటుంది మరియు దీని అర్థం " అన్ని జీవులను పోషించే గొప్ప దేవతకు నేను నమస్కరిస్తున్నాను ." మంత్రం శాంతి, శ్రేయస్సు , విముక్తిని అందిస్తుందని నమ్ముతారు