ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు కలియుగ దైవం వెంకన్న , వెంకటేశ్వర స్వామి వార్షిక ఆదాయం 1000 కోట్లకు పైనే.. ఆయనకున్న బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఎన్నో.. శ్రీనివాసుడికి నిలువు దోపిడీ ఇవ్వడం భక్తులకు అలవాటు, అది వారి నమ్మకం కూడా.. కొన్ని వందల కిలోల పసిడి ఆ కొండల్లో నిలఉండి ఉంటుంది.. స్వామి వారిని 2700 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు, ఈ 2700 కిలోల బంగారు ఆభరణాలలో 242 రకాల నగలునై.

* ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు ఎవరు..?
*శ్రీవారి సంపదంతా కుబేరుడి అప్పు తీర్చడానికే సరిపోతుందా..?
*అనంత పద్మనాభునికే అప్పిస్తానంటున్న ఆ శ్రీమంతుడు ఎవరు..?
* చరిత్రకు తెలియని సంపదను చూపించి అహో అనిపిస్తున్న ఆ దేవుడెవరు..?

సంపదలో శ్రీమంతుడు తిరుమల శ్రీవారు అనుకుంటే, ఆయనను తలదన్నే సంపద నా దగ్గర ఉందన్నాడు అనంత పద్మనాభుడు.. ఐతే దేవతలలో ధనవంతుడు కుబేరుడు.. కుబేరుడికే అప్పిస్తానంటున్నాడు పూరి జగన్నాధుడు...ఇంతకీ అంత సంపద ఏ దేవుడి దగ్గరవుంది.

తిరుమల శ్రీవారు.. సిరిగల శ్రీవారు..!

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు కలియుగ దైవం వెంకన్న , వెంకటేశ్వర స్వామి వార్షిక ఆదాయం 1000 కోట్లకు పైనే.. ఆయనకున్న బంగారం, వజ్రాలు, ఆభరణాలు ఎన్నో.. శ్రీనివాసుడికి నిలువు దోపిడీ ఇవ్వడం భక్తులకు అలవాటు, అది వారి నమ్మకం కూడా.. కొన్ని వందల కిలోల పసిడి ఆ కొండల్లో నిలఉండి ఉంటుంది.. స్వామి వారిని 2700 కిలోల బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు, ఈ 2700 కిలోల బంగారు ఆభరణాలలో 242 రకాల నగలునై. తలపై కిరీటం మొదలు పాదుకలవరకు 108 రకాల ఆభరణాలతో అలంకరిస్తారు.. ఇలా వారానికి ఒక సెట్టు చొప్పున మూడు సెట్ల ఆభరణాలని శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తారు.. ఇవే కాకుండా పండగలకు, బ్రహ్మోత్సవాలకు విశేష ఆభరణాలను అలంకరిస్తారు.. శ్రీనివాసుని అలంకరణ కోసం ఆయన ఖజానాలో ఉన్న ఆభరణాల తూకం 40 టన్నుల పైనే.. ఆకాశరాజు సమర్పించిన కానుకల మొదలు భక్తులు సమర్పించే కానుకలన్నీ ఆ ఖజానాలోనే భద్రపరుస్తారు. శ్రీవారికి ఉన్న ఆభరణాలన్ని అతి పురాతనమైనవి. అందుకే వీటి విలువెంతో లెక్కకట్టలేకపోతున్నారు. ఐతే వెంకన్నకు బంగారమే కాకుంగా కోట్లరూపాయలలో ధనాన్ని కానుకలుగా సమర్పిస్తారు భక్తులు...

Lord Venkateswara, Family Deity of Tribal People in Tirumala | HinduPad

అనంత పద్మనాభుని సంపద ఎంత..!

వైకుంఠ నాథుని 108 దివ్య క్షేత్రాల్లో తిరువనంతపురం ఒకటి .. ఇక్కడ స్వామివారు భుజగశయన రూపంలో యోగనిద్రలో భక్తులకు దర్శనమిస్తారు.. ఈయన లక్ష్మి నాధుడు, అందుకే అతి విలువైన ధనసంపదకు అధిపతైన ఏడుకొండల వాడితోనే పోటీపడుతున్నాడు.. కొద్ది సంవత్సరాల క్రితం పద్మనాభుని ఆలయంలో దొరికిన అనంత సంపద చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే.. టన్నుల కొద్దీ బంగారం , వజ్రాలు, వింత ఆభరణాలు,పచ్చలహారాలు,నవరత్నమణులు ,బంగారు నాణాలు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో.. ఎన్నెనో...ఐతే ఇవన్నీ ఐదు గదుల్లో ఉన్న సంపద మాత్రమే.. ఆరో గదికి నాగదేవతలు దిగ్బంధించి ఉండడంతో ఆ గదిని తెరిచేందుకు భయపడుతున్నారు.. ఐదు గదులతో పోల్చుకుంటే ఆరో గది చాలా పెద్దది, ధృడమైనది అందుకే దీంట్లో ఇంకా విలువైన సంపద ఉండొచ్చని భావిస్తున్నారు... ఐతే ఇవన్ని పురాతన ఆభరణాలు కావడంతో వీటి విలువేన్తో ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు...

anantha padmanabha swamy

వేల ఎకరాలున్న భూస్వామి.. కొన్ని కోట్ల సంపదకు ఆసామి..!

పూరి లో జగన్నాధుడు కొలువై ఉన్నాడు.. ఇక్కడ దేవతామూత్రుల విగ్రహాలు చెక్కతో చేసినవి.. సోదరుడు బలభద్రుడు , సోదరి సుభద్రలతో కలిసి జగన్నాధు భక్తులకు దర్శనమిస్తాడ.. జగన్నాథుని ఆస్తులు అనంతం. ఆయనకు రామేశ్వరం నుంచి భువనేశ్వరం వరకు బూములునై. జగన్నాథుని ఆలయం కింద నేల మాలిగలు దాగున్నాయి . మొత్తం ఏడు గదుల్లో సంపద దాగునట్టు శాస్త్రాలు చెప్తున్నాయి.. వీటిలో మూడు గదులు తెరిచారు.. ఈ సంపదపై నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.. గత ఏడాది జగన్నాధుడి తలుపులు తెరవాలంటూ ఒడిశా హై కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది... కానీ అది సంపద ఎంతుందో తెలుసుకోవడానికి కాదు.. ఆ గదుల సామద్యం ఎలావుందో తెలుసుకోవడానికి.. దేవాలయ దర్మకత్తలు , కోర్టు అధికారులు,ఏస్పీ , పురావస్తు శాఖ ఇంజనీర్లు పాములు పట్టే వాళ్లతో కలిపి మొత్తం 16 మంది సభ్యులు ఆ గదుల్లోకి ప్రవేశించారు.. అక్కడ చేసిన పరిశీలనన్నిటిని వీడియో రూపంలో కోర్టుకు సమర్పించింది.. ఐతే జగన్నాధుడి సంపద ఎంత అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు.. ఇదిలాఉంటే జగన్నాధుడికి వేల ఎకరాల భూసంపద ఉంది. ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే కాదు మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఈయనకు భూ ఆస్తులనై.. ఇది చెప్పింది ఎవరో కాదు దేశ అత్యున్నత న్యాయస్థానం .. ఎన్నో చిక్కుముడులను విప్పుకుంటూ కొన్ని వేల ఎకరాలకు ఆసామి ఆ జగన్నాథుడే అంటూ కోర్టు తీర్పు వెలువడించింది.. మొత్తం 60 వేల 418 ఎకరాలు , అంటే ఈ భూమితో పూరి లాంటి 15 నగరాలను నిర్మించవచ్చు.. సిరితోను, భూ సంపదతోనూ జగన్నాధుడు భళా అనిపిస్తునాడు..

Sri Kshetra, Puri, Lord Jagannath, Odisha

సంపదలో ఈ ముగ్గురు దేవుళ్లు ఎవరికి వారే సాటి..శ్రీవారి నేల మాలిగల్లో సంపదేన్తో తెలియదు.. అనంత పద్మనాభుని ఆరో గదిలో ఏముందో తెలియదు.. జగన్నాధుని సంపద గురించి తెలుసుకునే ప్రయత్నమూ జరగలేదు.. ఇలా సంపదలో ఒకరికి ఒకరు పోటీపడుతూ అందరని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి... ఇంతకీ ఆ కుబేరుడికే అప్పిచ్చే సంపద ఎవరిది అన్నది పెద్ద ప్రశ్నగానే మారింది..? " Written By : Ashok Kumar "

Updated On 2 May 2023 5:48 AM GMT
Ehatv

Ehatv

Next Story