కర్ణాటకలోని(Karnataka) గోకర్ణం(Gokarnam) కథ తెలుసుగా! తల్లికిచ్చిన మాట మేరకు లంకాధీశుడు రావణాసురుడు(Ravan) శివుడి(Lord Shiva) కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. రావణుడు ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తాడు. ఈ లింగాన్ని నేల మీద ఉంచితే అది స్థిరంగా ఉండిపోతుందని హెచ్చరిస్తాడు.
కర్ణాటకలోని(Karnataka) గోకర్ణం(Gokarnam) కథ తెలుసుగా! తల్లికిచ్చిన మాట మేరకు లంకాధీశుడు రావణాసురుడు(Ravan) శివుడి(Lord Shiva) కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. రావణుడు ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. శివుడు తన ఆత్మలింగాన్ని రావణుడికి ఇస్తాడు. ఈ లింగాన్ని నేల మీద ఉంచితే అది స్థిరంగా ఉండిపోతుందని హెచ్చరిస్తాడు. ఆత్మలింగం రావణుడి చెంత ఉంటే అతడు మహాబలవంతుడవుతాడు. అందుకే దాన్ని నేల మీద పెట్టించడానికి వినాయకుడు(Lord vinayaka) బ్రహ్మచారి(Bachelor) రూపంలో అక్కడికి వస్తాడు. అప్పటికి సాయంత్రం అవుతుంది. రావణుడికి సంధ్యావందనం చేయాల్సి వస్తుంది. బాలకుడి రూపంలో ఉన్న వినాయకుడికి ఆత్మలింగాన్ని ఇచ్చి నేల మీద పెట్టవద్దని చెబుతాడు.
రావణుడు సంధ్యావందనానికి వెళ్లినప్పుడు మూడు మార్లు ఆయనను పిలుస్తాడు. ఆయన రాకపోయేసరికి ఆత్మలింగాన్ని కిందపెడతాడు బాలుడి రూపంలో ఉన్న వినాయకుడు. రావణుడు తన బలంతో లింగాన్ని కదల్చే ప్రయత్నం చేస్తాడు కానీ విఫలుడవుతాడు. భూమిలో స్థిరపడిన లింగానికి మహాబలేశ్వర(Mahabaleshwaram) అనే పేరు వచ్చింది. ఆ క్షేత్రం భూకైలాసంగా ప్రసిద్ధిగాంచింది. గోకర్ణం చరిత్ర ఇది!
ఇంచుమించు ఇలాంటి పురాణగాధే ఉత్తర భారతంలో(North India) ప్రసిద్ధి చెందింది. కాకపోతే ఈ కథ బహు చిత్రంగా ఉంటుంది. జార్ఖండ్‌లోని(Jharkhand) బైద్యనాథ్‌లో(Baidyanath) ఓ ప్రాచీన శివాలయం(Shiva Temple) ఉంది. ఇక్కడి లింగాన్ని రావణుడు తీసుకొచ్చాడనేది స్థలపురాణం. ఈ ఆలయానికి సమీపంలో రెండు తటాకాలున్నాయి(Ponds). వాటిలో ఒకటి రావణుడు మూత్రంపోస్తే(Urine) ఏర్పడిందని అంటారు.
అందుకే ఈ చెరువులోని నీటిని జనం అసలు ముట్టుకోరు. నీటిని ఏ పనులకు ఉపయోగించరు. ఇప్పుడు స్థలపురాణం తెలుసుకుందాం! శివభక్తుడైన రావణబ్రహ్మ మహాశివుడికి ప్రతిరూపంగా ఉన్న శివలింగాన్ని తన లంకానగరానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. రావణుడి మాట కాదనలేడు శివుడు. ఎందుకంటే ఆయన పరమభక్తుడు కాబట్టి. శివలింగం లంకకు చేరితే రావణుడు మహాబలసంపన్నుడవుతాడు. కైలాసమే లంకకు తరలివెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే శివుడు ఓ ఉపాయం పన్నుతాడు. శివలింగాన్ని దారిలో ఎక్కడ కిందపెట్టినా అది మళ్లీ కదలదని రావణుడితో చెబతాడు. రావణుడు సరే అంటాడు.
అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలనుకుంటాడు. శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో లఘుశంక కోసం ఆగుతాడు. ఈ సమయంలో విష్ణువు(Lord Vishnu) బాలుని రూపంలో రావణుడి దగ్గరకు వస్తాడు. ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు లంకేశ్వరుడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని అంటారు. అదే బైద్యనాథ్ క్షేత్రం. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని చెబుతారు. అందుకే దానిని రావణుడి మూత్రం చెరువుగా పిలుస్తారు. ఇందులోని నీటిని ఎవరూ వాడరు.