కలియుగ దైవంగా తిరుమలలో కొలువై ఉండి, ఎంతో మంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన తిరుమలేశుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కలియుగ దైవంగా తిరుమలలో కొలువై ఉండి, ఎంతో మంది భక్తుల ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన తిరుమలేశుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రతిరోజు కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.

ఎంతో పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్యఫలంగా భావిస్తారు.

ఈ తిరుమల కొండ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో కథలు ఉన్నాయి. తిరుమలలో ఏడు కొండల పైన స్వామివారు కొలువై ఉన్నారు. ఒక్కో కొండకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా తిరుమల కొండకు ఒక్కో యుగంలో ఒక్కో పేరు ఉండేవి. మరి అవి ఏమిటి తిరుమల కొండ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం.

వెంకటేశ్వరుడు అంటే....?

వేం -పాపం

కట -తీసేయడం

శ్వరుడు -తొలగించే వాడు అనిఅర్థం .

ఈ కలియుగంలో మానవులు మనసు దైవ పాదాలచెంత కాకుండా భౌతిక సుఖాల వైపు కలిగి ఉండటం చేత ఎన్నో పాపాలను చేస్తుంటారు.

ఈ విధంగా పాపాలు చేసే వారిని కాపాడటం కోసమే ఆ భగవంతుడు శ్రీ వెంకటేశ్వరస్వామి రూపంలో ఆవిర్భవించారని చెప్పవచ్చు.

ఇక ఎంతో ప్రసిద్ధి చెందిన స్వామివారు కొలువై ఉన్న శ్రీ తిరుమల కొండ విషయానికి వస్తే సాక్షాత్తు వేదాలే ఆ కొండ అయ్యాయి.

విష్ణుమూర్తి ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తి ధర్మాన్ని కాపాడాడు అనే విషయం మనకు తెలిసిందే.

కృతయుగంలో నరసింహావతారం,

త్రేతాయుగంలో శ్రీరాముడిగా,

ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు,

కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించి పాపాన్ని సంహరించే న్యాయం వైపు నిలబడ్డారు.

అయితే పై మూడు యుగాలలో స్వామి వారు దుష్ట సంహారం చేశారు కానీ, కలియుగంలో మాత్రం స్వామి వారు తొండమాన్ చక్రవర్తి మీద కోపం వల్ల మాట్లాడటం లేదని అందువల్లే వెంకటాచల క్షేత్రం పరమపావనమైనదని చెప్పవచ్చు.

ఒక్కో యుగంలో స్వామివారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చినట్టుగానే తిరుమల కొండను కూడా ఒక్కో యుగంలో ఒక్కో పేరుతో పిలిచేవారు.

కృతయుగంలో వృషాచలం, త్రేతాయుగంలో అంజనా చలం, ద్వాపర యుగంలో శేషచలం, కలియుగములో వెంకటాచలం అనే పేర్లతో పిలిచేవారు. యుగాలు మారినా, కొండ పేర్లు మారిన కొండకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మాత్రం మారలేదు.

పురాణాలలో ఏడుకొండల గురించి ఈ విధమైన శ్లోకం ఉంది

కృతేతు వృశాచలoచ ;

త్రేతాయాం అంజనాచలౌ ;

ద్వాపరే శేషచలoచ

కలౌ వెంకటాచలం.

🙏ఓం నమో వెంకటేసాయా 🙏

ehatv

ehatv

Next Story