ఈ దీపం శివుడి ముందు వెలిగిస్తే అప్లైశ్వర్యాలు కలగడం ఖాయం..
ఈ దీపం శివుడి ముందు వెలిగిస్తే అప్లైశ్వర్యాలు కలగడం ఖాయం...
కొబ్బరికాయ లో దీపంవెలిగించండి.
సమస్యలు అన్ని పోతాయి...
కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా కలిగే ఫలితాలేంటో తెలుసుకుందాం..
సమస్యల నుంచి గట్టెక్కాలంటే మాత్రమే కొబ్బరిలో దీపం వెలిగించాలి...
ఆర్థిక ఇబ్బందుల నుంచి, దారిద్ర నాశనానికి కొబ్బరి దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే కృష్ణ, శుక్ల పక్ష అష్టమి రోజున కాలభైరవునికి కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా శుభఫలితాలుంటాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. ఏలినాటి శనిగ్రహదోషాల ప్రభావం తగ్గుతుంది.
దీపాలు పలు రకాలు
దీపావళి... ఊరూ వాడా దీపాల వెలుగులతో నిండిపోయే పండుగ. దీపం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అంశ. చిరు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దణం పెట్టుకుంటే చాలు అనుగ్రహించి వరాలు ఇచ్చే చల్లని తల్లి లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి అంశగా పూజించే దీపాలు ఇంటికి వెలుగులు ఇవ్వటమే కాదు మనస్సుకు ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. వెలుగులు చిమ్మే దీపాన్ని చూస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంటిలో ఆధ్మాత్మిక భావన నిండుతుంది. ఇల్లు విశేషాలు కలిగిన దీపాలలో కూడా పలు రకాలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు.
సాధారణంగా దీపం అంటే దేవుడి ముందు వెలిగిస్తుంటాం. అలాగే కార్తీక మాసం వచ్చిందంటే చాలు దీపాల వెలుగులు మనస్సుల్ని ఆహ్లాదపరుస్తాయి. కాలువలు, వేకువజామునే లేచి నదుల్లో పుణ్యస్నానాలు చేసి అరటి డొప్పలలో ఆవునెయ్యితో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలాంటి దీపాల్లో పలు రకాలే ఉన్నాయి.
దీపం వెలిగించే ముందు ‘దీపలక్ష్మీ నమోస్తుతే’ అంటూ దీపం వెలిగించాలి. అలాగే దీపం వెలిగించగానే ‘దీప లక్ష్మీ నమో నమః’ అని అనుకుంటు మనస్ఫూర్తిగా దీపానికి నమస్కరించి అప్పుడు పూజా కార్యక్రమంలోకి వెళ్లాలి. ఆగమశాస్త్రాలలో దీపాలలో రకాలను వివరిస్తూ తెలియజేసిన విశిష్టతలు ఏంటో ఈ దీపావళి రోజు పర్వదినం సందర్భంగా తెలుసుకుందాం..
చిత్రదీపం.
ఇంధ్రదనస్సులాంటి రంగులతో ముగ్గులు పెట్టి ఆముగ్గు మీద పెట్టే దీపాన్ని చిత్ర దీపం అంటారు.
మాలా దీపం.
అంతస్థులుగా వుండే దీపపు పళ్ళేలలో వెలిగించే దీపాలను మాలా దీపం అంటారు. అంటే దీపాలు పూల మాలలా ఉంటాయని అర్థం..
ఆకాశ దీపం.
ఆకాశ దీపం అంటే దేవాలయాల్లో ధ్వజ స్థంభానికి కట్టే దీపాన్ని ఆకాశ దీపం అంటారు. కార్తీక మాసం వచ్చిందంటే గ్రామాల్లోని శివాలయాల్లో సాయంత్రం అంటే దీపాల వేళ ధ్వజ స్థంబాలకు దీపాన్ని కడతారు. ఈ దీపం గ్రామం అంతా ధ్వంజ స్థంభం పైకి లేపి కడతారు. అలాగే కొంతమంది ఇంటి ముందు ఎత్తుగా ఉండే ప్రదేశంలో దీపాన్ని వెలిగిస్తారు. దీపాలను యిలా వెలిగించి పెడితే
భయాలు తొలగిపోతాయని అంటారు.
జల దీపం.
కాలువలు, నదులు వంటి పారే నీటితో పాటు చెరువుల్లో కూడా కార్తీక మాసంలో మహిళలు తెల్లవారు ఝామునే లేచి దీపాలు వెలుగిస్తారు. ఆ దీపాలను అరటి డొప్పల్లో పెట్టి నీటిలో వదులుతారు. ఈ దీపాలను జల దీపం అంటారు.
పడవ దీపం.
నదీ తీరాలలో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. పడవలా వెళ్ళే ఈ దీపమే నౌకా దీపం అని అంటారు.
సర్వ దీపం.
గృహంలో వరుసగా వెలిగించే దీపాలు సర్వదీపం అని అంటారు..
మోక్ష దీపం.
పితృదేవతలు సద్గతులు పొందాలని ఆలయ గోపురం మీద వెలిగించే దీపం.
సర్వాలయ దీపం.
కార్తీక పౌర్ణమి రోజున సాయం కాలం సమయంలో శివాలయాల ముందు వెలిగించే దీపాలు.
చొక్కపనై దీపం.
కార్తిక మాసంలో పౌర్ణమినాడు శివాలయాలకి ముందు తాటాకులతో పెద్ద గూడగా అల్లి దానికి పూజ చేసి, దీపారాధన చేసి కర్పూరజ్యోతిని దానిలో వెలిగిస్తారు. దీన్నే చొక్కపనై దీపం అని అంటారు. ఈ దీపం గురించి చాలామందికి తెలియదు..గానీ తాటాకులో దీపం చాలా మంచిది.
అఖండ దీపం.
నిత్యం వెలిగే దీపాలను అఖండ దీపం అంటారు. కొండ శిఖరాన పెద్ద దీపంగా వెలిగించేదాన్ని కూడా అఖండ దీపం. తిరువణ్ణామలై , తిరుక్కళుకున్డ్రమ్ , పళని, తిరుప్పర కున్డ్రమ్ ఆలయాలలో ఆలయాలలో అఖండ దీపం దర్శనం సర్వపాప హరణం అంటారు. ఈ దీపాలను చూసేందుకు దేవాలయం పున: ప్రారంభం నాడు ఎంతోమంది ఆసక్తి చూపిస్తారు.
లక్ష దీపం.
ఒక లక్ష దీపాలతో ఆలయమంతటా అలంకరించడం లక్ష దీపం . మైలాపూర్, తిరువణ్ణామలై, తిరుక్కళుకున్డ్రమ్ 12 సంవత్సరాలకి ఒకసారి వెలిగిస్తారు. ఆలయాలలో అలంకరించడాన్ని లక్ష దీపం అని అంటారు.
పిండితో చేసే దీపాలు.
అమ్మవారి ఆలయాలలో మొక్కులున్నవారు పిండితో దీపాలు వెలిగిస్తారు. వీటినే పిండి దీపాలు అంటారు. పిండి అంటే వరిపిండితో వెలిగిస్తారు. కార్తిక మాసంలో ప్రతిగృహంలోను పిండి దీపాలు వెలిగించి పూజిస్తారు. కంచి కఛ్ఛపేశ్వరాలయంలో కార్తిక మాసంలోని ఆదివారములలో పిండి దీపం శిరస్సున ధరించి ఆలయానికి ప్రదక్షిణలు చేసే ఆచారం ఉంది.
వృక్ష దీపం.
ఒక చెట్టు ఆకాంలో ఉండే అంతస్తులుగల కొమ్మల వలె వుండే ఆలయ స్ధంభాలలో దీపాలు వెలిగిస్తారు.
కేరళ దేవాలయాలలో ఈ వృక్షదీపాలు ఎక్కువగా ఉంటాయి. చిదంబరం, తిరువణ్ణామలై, ఆలయాలలో కూడా వృక్ష దీపాలు చాలా విశిష్టతను సంతరించుకున్నాయి.