వినాయక చవితి(Vinayaka chathurthi) పండుగ కోసం దేశం ముస్తాబవుతోంది. పండుగ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వినాయకచవితిన మన భాద్రపద మాసంలో(Bhadrapada) జరుపుకుంటాం. అంటే వ్యసాయ తొలి సీజన్ ఖరీఫ్ మంచి ఊపు అందుకునే సమయం అన్నమాట! మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయమే ప్రధాన వృత్తి. మనం చేసే ప్రతీ పని, జరిపే ప్రతి పండుగ వ్యవసాయానికి(Agriculture) అనుసంధానించి ఉంటాయి.
వినాయక చవితి(Vinayaka chathurthi) పండుగ కోసం దేశం ముస్తాబవుతోంది. పండుగ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వినాయకచవితిన మన భాద్రపద మాసంలో(Bhadrapada) జరుపుకుంటాం. అంటే వ్యసాయ తొలి సీజన్ ఖరీఫ్ మంచి ఊపు అందుకునే సమయం అన్నమాట! మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయమే ప్రధాన వృత్తి. మనం చేసే ప్రతీ పని, జరిపే ప్రతి పండుగ వ్యవసాయానికి(Agriculture) అనుసంధానించి ఉంటాయి. వినాయక చవితి కూడా అంతే! సాధారణంగా నాట్లు వేయడంలో రైతన్నలు తీరిక లేకుండా గడిపే సమయం ఇది! అందుకే గణపతికి(Lord Ganesh) తొలి పూజలు చేసి పవిత్రమైన వ్యవసాయపనులను మొదలు పెడతారు రైతులు. వినాయకుడిది భారీ కాయం. ఏనుగు తల! అంటే భారీ పదార్థం. భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే మెటీరియల్. పదార్థం నుంచే సృష్టి జరుగుతుంది. మట్టి నుంచే పంట పండుతుంది. అంటే వినాయకుడు స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి(Intelligence) సింబల్. ఆయనకు ఉండే ఏక దంతం(Elephant Tooth) రైతు పొలంలో పట్టే నాగలికి(plough) గుర్తు. ఆయనకు ఉన్న పెద్ద పెద్ద చెవులు తూర్పారబట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకో, గుమ్మికో గుర్తు. తల భాగం గాదెపై బోర్లించిన గంపను సూచిస్తుంది. ఎలుకలను వాహనంగా చేసుకోవడం అంటే పంటలను పాడు చేసే మూషికాలను అణచివేయడానికి గుర్తు. తన పొట్టను వినాయకుడు పాములతో బిగించి కట్టుకోవడానికి కూడా అదే గుర్తు. వినాయకచవితి రోజున ఆ ఆదిదేవుడికి 21 రకాల పత్రాలతో పూజిస్తారు. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన పత్రాలతో కొలుస్తారు. ఇవన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడయ్యాడని చెబుతారు. వినాయకుడిని పూజించటం అంటే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే అవుతుందని ఎంతో భక్తితో భావిస్తారు.