యాదాద్రి, భద్రాద్రి, మంగళగిరి, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో రేపటి నుంచి వైకుంఠనాథుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. ఈ ఆలయాలతో పాటు రెండు రాష్ట్రాల్లోని వైకుంఠనాథుడు కొలువైన పలు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ (Vaikunta Ekadasi)దర్శనాల కోసం ఆలయాలు ముస్తాబవుతున్నాయి. రేపటి నుంచి వైకుంఠ దర్శనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. తిరుమల, యాదాద్రి, భద్రాద్రి, మంగళగిరి, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాల్లో రేపటి నుంచి వైకుంఠనాథుడు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారు. ఈ ఆలయాలతో పాటు రెండు రాష్ట్రాల్లోని వైకుంఠనాథుడు కొలువైన పలు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలో రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఈరోజు మ.2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు విక్రయిస్తారు. తిరుపతిలోని 10 కౌంటర్ల దగ్గర ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 10 రోజులకు సంబంధించిన 4.25 లక్షల టోకెన్లకు భక్తులకు జారీ చేయనున్నారు. టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు అర్ధరాత్రి తర్వాత శ్రీవారి వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరవనుంది.