మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) ఇండోర్‌(Indore)లోని బాలేశ్వర మహాదేవ్‌ ఆలయం(Baleshwar Mahadev Mandir)లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. శ్రీరామనవమి(Sri Rama Navami) సందర్భంగా భక్తులు(Devotees) భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. మెట్లబావిని కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేకపోయింది. పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) ఇండోర్‌(Indore)లోని బాలేశ్వర మహాదేవ్‌ ఆలయం(Baleshwar Mahadev Mandir)లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు. శ్రీరామనవమి(Sri Rama Navami) సందర్భంగా భక్తులు(Devotees) భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. మెట్లబావిని కవర్‌ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేకపోయింది. పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటిదాక 35 మంది చనిపోయారు. ఇంకా కొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. అధికారులేమో ఒక్కరే మిస్సింగ్‌ అని అంటున్నారు. సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్‌ ఆపరేషన్‌.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆలయానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇండోర్‌ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఉన్న ఆలయం ఓ ప్రైవేటు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆలయం ప్రాంగణంలో ఉన్న మెట్ల బావి లోతు 40 అడుగులపైనే ఉంటుంది. ఈ ఆలయంలోని పరిస్థితులపై ఇంతకు ముందు తాము అనేకసార్లు ఫిర్యాదు చేశామని, మున్సిపల్‌ అధికారులు పట్టించుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఇండోర్‌ మున్సిపల్‌ అధికారులు మాత్రం తాము నిరుడు ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు ఇచ్చామని అంటున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలు ఎక్కువయ్యాయని, తాము అందు కోసం నోటీసులు ఇచ్చామని చెబుతోంది. ట్రస్ట్‌ మాత్రం తమకు ఎలాంటి నోటీసులు రాలేదని అంటోంది. పైగా మతపరమైన విషయాలలో ఇండోర్‌ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువయ్యిందని ఆరోపిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా మెట్లబావిని కవర్‌ చేస్తూ ఆలయ నిర్వాహకులు హోమం చేశారు. అయితే స్లాబ్‌ నిర్మాణం నాసిరకంగా జరిగిందని, 30 మందికంటే ఎక్కువ అది మోయలేదని స్థానికులు అంటున్నారు. కుప్పకూలడానికి ఇదే ప్రధానకారణమని విమర్శిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అయిదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించారు. చికిత్స ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఎన్‌ఆర్‌ఎఫ్‌ కూడా మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడినవారికి 50 వేల రూపాయలు ప్రకటించింది.

Updated On 30 March 2023 11:23 PM GMT
Ehatv

Ehatv

Next Story