ధర్మపురి లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పక్కనే ఉన్న యమ ధర్మరాజు(Yama Dharma Raju) ఆలయానికి ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రెండో రోజున వచ్చే యమ ద్వితీయ, వేసవి కాలంలో వచ్చే భరణి నక్షత్రం నాడు భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి(Dharmapuri). ఇక్కడ శ్రీ లక్ష్మ నరసింహ స్వామి కొలువైయున్న సంగంతి మనందరికీ తెలుసు. అదే పుణ్యక్షేత్రంలో మరో ప్రఖ్యాతి గుడి ఉంది అదే యమధర్మ రాజు గుడి.
పేరు వినగానే పై ప్రాణాలు పైకే పోయే యముడి(Yama Dharma Raju ) కి గూడేంటి? అక్కడికి ఎవరు వెళ్తారు? ఏమని కోరుకుంటారు అనే కదా మీ డౌట్. సో వాచ్ ఠిస్ స్టోరీ
ధర్మపురి లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పక్కనే ఉన్న యమ ధర్మరాజు(Yama Dharma Raju) ఆలయానికి ప్రతి సంవత్సరం దీపావళి తర్వాత రెండో రోజున వచ్చే యమ ద్వితీయ, వేసవి కాలంలో వచ్చే భరణి నక్షత్రం నాడు భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
పవిత్ర కార్తీక మాసంలో(Karthika Masam) వచ్చే రెండో తిది విధియని యమ విదియ(Yama Vidhiya), లేక యమ ద్వితీయ(Yama dhvithiya) అంటారు. యమ ద్వితీయ రోజున యముడు తన చెల్లి యమునాదేవి(Yamuna Devi) ఇంటికి భోజనానికి వెళ్లాడని చెబుతారు. తిరిగి యమలోకం వెళ్లే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని కథ ప్రచారంలో ఉంది. అలా చేస్తే.. అకాల మరణం సంభవించదని అంటుంటారు. అందుకోసమే.. దీపావళి రెండో రోజున అంటే కార్తీక విదియ నాడు సోదరీమణులు తమ సోదరులను భోజనానికి పిలుస్తారంటారు. దీనినే భగినీ హస్త భోజనం(Bhagini Hasta Bhojanam), భగినీ అంటే సోదరి అని 'భాయిదూజ్'(Bhai dhuj) అని పిలుస్తుంటారు.
వైదిక సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం లో యముడు తన దంష్ట్రలను తెరుచుకుని ఉంటాడని, ఈ కాలం లో భూలోకంలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయని, అకాలమరణాల నుంచి తప్పించుకోవాలంటే యమవిదియ రోజున సోదరి ఇంట్లో భోజనం చెయ్యాలని అంటారు. ఇది ముఖ్యంగా కార్తీక పురాణం లో చెప్పబడి ఉంది. అందుకే ఆ రోజు దక్షిణాదిలో భగినీ హస్త భోజనం అని ఉత్తరాదిన భాయ్ దూజ్ అనే సంప్రదాయం వచ్చిందంటారు
భక్తులు తమ జీవితాలలో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు యమ ధర్మరాజు కి గండ దీపంలో నూనె పోసి పూజిస్తారు. ఇలా దీపం వెలిగిస్తే గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా కొందరు భక్తులు శనిగ్రహ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆయురారోగ్యాలు కోసం యమ ధర్మ రాజుకు మన్యు సూక్తం, ఆయుష్య సూక్తం, అభిషేకం, హారతి , మంత్ర పుష్పం, రుద్రాభిషేకం, ఆయుష్ సూక్త హోమం వంటి ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకి ఎంతో భక్తితో ఇక్కడ పూజలు చేస్తారు. ఇలా గుడి ఉండటం ఆశ్చర్యంగా అనిపించినా.. కొన్ని వందల ఏళ్ల నుంచి ధర్మపురిలో యముడు పూజలు అందుకుంటున్నాడు. శని గ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్న వారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు. తమ జాతకాలు బాలేవు అని, ఏం చేసిన కలిసి రావట్లేదని, జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని అనుకునే వాళ్లు కూడా ఇక్కడకు వస్తుంటారు.
గోదావరి పాయ ఒడ్డున ఉండే ఈ యమ క్షేత్రం ఆధ్యాత్మికత తో పాటు చక్కటి ప్రకృతి ఆహ్లదని కూడా అందిస్తుంది.