కనిపించే ప్రత్యక్ష దైవంగా సూర్యభగవానుడిని కొలుస్తాం ..భానుడు నమస్కార ప్రియుడు . సూర్యుని ఆరాధనకు ఆదివారం చాలామంచిది.... సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే ..సూర్యునికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి దీపారాధన చేయాలి. సూర్యుని అనుగ్రహం కోసం సూర్యకవచం, సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం శ్లోకాలను పఠించాలి. అలాగే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. , గ్రహరాజు అయినటువంటి సూర్యుని ఆరాధన సూర్య గ్రహ అనుకూలత తో పాటు నవగ్రహ అనుకూలత కలుగుతుంది. అనారోగ్య […]

కనిపించే ప్రత్యక్ష దైవంగా సూర్యభగవానుడిని కొలుస్తాం ..భానుడు నమస్కార ప్రియుడు . సూర్యుని ఆరాధనకు ఆదివారం చాలామంచిది.... సూర్యభగవానుడి అనుగ్రహం పొందాలంటే ..సూర్యునికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం రోజున ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి దీపారాధన చేయాలి. సూర్యుని అనుగ్రహం కోసం సూర్యకవచం, సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం శ్లోకాలను పఠించాలి. అలాగే నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. , గ్రహరాజు అయినటువంటి సూర్యుని ఆరాధన సూర్య గ్రహ అనుకూలత తో పాటు నవగ్రహ అనుకూలత కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం సూర్యుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. జాతకంలో రవి అనుగ్రహం లేనివారిలో కుటుంబంలో కలహాలు కలుగుతుంటాయి. రవి స్థానం బలంగా ఉండాలంటే నిత్యం సూర్యున్ని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండొచ్చు.

నిత్యం తెల్లవారుజామున లేచి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చే సమయంలో చేతులను సాధ్యమైనంతవరకు పైకి లేపాలి. ఇది ఒక దినచర్యగా పాటించాలి. ఇలా నిత్యం చేస్తుంటే సూర్యుడు చాలా సంతోషిస్తాడట. కలిగియుగ ప్రత్యక్షదైవంగా పేరొందిన సూర్యభగవానుడికి నిత్యం సరైన విధానంలో అర్ఘ్యం సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఫలితంగా కుటంబానికి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతతను అందిస్తాడనీ.. వారసత్వపరంగా ఏమైనా ఆస్తుల వివాదాలు గానీ, కోర్టు వంటి వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

శీతల ప్రదేశాల్లో ఉండే వారికి సూర్యుడు కనిపించడు. మరి సూర్య నమస్కారం ఎలా చేయాలంటే.. ఉదయం లేవగానే ప్రతిరోజూ సూర్యోదయం అయ్యే దిక్కులో అర్ఘ్యం ఇస్తే సరిపోతుంది .. కొంతమందికి స్నానమాచరించే పరిస్థితి ఉండదు. అలాంటి అప్పుడు కాళ్లు, ముఖం, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పరిశుభ్రమైన బట్టలను ధరించి సూర్య నమస్కారం ఆచరించుకోవచ్చు. సూర్యునికి అభిముఖంగా నిల్చుని ద్వాదశ నామాలతో నమస్కారం చేయడం అన్నది అతి సులభం. అంతే కాకుండా ఆర్ఘ్యము కూడా సూర్య అనుగ్రహము కలిగిస్తుంది.

సూర్యునికి జిల్లేడు పూలు, గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం.. అందుబాటులో ఉంటే వీటితో పూజ చేసుకోవచ్చు . ప్రత్యేకించి గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని సూర్యునికి నైవేద్యంగా సమర్పించండి. బియ్యం, బెల్లం, ఆవు పాలు, ఆవునెయ్యితో చేసిన నైవేద్యం సూర్యునికి చాలా ఇష్టం.రాత్రి సమయంలో గోధుమ రవ్వతో చేసిన పదార్థం సూర్యునికి నైవేద్యంగా ఆరగింపు చేయాలి. ఆ తర్వాతే ఆహారం తీసుకోవాలి. ఆదివారం రోజు దగ్గరలోని సూర్యుని దేవాలయం ఉంటే వెళ్లి దర్శించుకుంటే చాలా మంచిది.

Updated On 13 Feb 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story