నగరాలు, పట్టణాలలోనే కాదు, ఇప్పుడు పల్లెల్లో కూడా వినాయకమండపాలు(Ganesha Mandapalu) వెలిశాయి. వినాయకుడి నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు. దేశవ్యాప్తంగా చవితి(vinayak Chavithi) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలలో విభిన్నమైన వినాయకులు కొలువుదీరారు. ప్రజలు తమ తమ స్తోమతను బట్టి వినాయక విగ్రహాలను కొన్నారు. డబ్బున్నవారు ఖరీదైన విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు.
నగరాలు, పట్టణాలలోనే కాదు, ఇప్పుడు పల్లెల్లో కూడా వినాయకమండపాలు(Ganesha Mandapalu) వెలిశాయి. వినాయకుడి నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు. దేశవ్యాప్తంగా చవితి(vinayak Chavithi) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండపాలలో విభిన్నమైన వినాయకులు కొలువుదీరారు. ప్రజలు తమ తమ స్తోమతను బట్టి వినాయక విగ్రహాలను కొన్నారు. డబ్బున్నవారు ఖరీదైన విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారు. సూరత్‌లోని ఓ వ్యాపారవేత్త దగ్గర ఉన్న గణేషుడి ప్రతిమ మాత్రం చాలా చాలా ప్రత్యేకం. చాలా చాలా ఖరీదైనది కూడా! ఖరీదైనదంటే పది లక్షలో, పాతిక లక్షలో ఉంటుందని అనుకుంటున్నారు కదూ! అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఇది వజ్రం కాబట్టి.. ఈ వజ్రం ముక్క అచ్చంగా వినాయకుడిని పోలి ఉండటంతో ప్రతీ ఏడాది దీనికి పూజలు చేస్తారా వ్యాపారి. తర్వాత నిమజ్జనం చేస్తారా అన్న అనుమానం వస్తున్నది కదూ! చేయరు. నది జలాలను విగ్రహం మీద చల్లుతారు. 2005లో కాంగోలోని మ్బుజీ గని నుంచి వేలంలో రాజేశ్ పాండవ్(Rajesh Pandav) అనే వజ్రాల వ్యాపారి ఈ వజ్రాన్ని కొన్నాడు. ఈ వజ్రాన్ని(Daimond) ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత అది వినాయకుడిని పోలి ఉందని గుర్తించాడు. పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ వజ్రపు విగ్రహం 24.11 మిల్లీమీటర్ల పొడవు, 16.49 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఇది 27.74 క్యారెట్స్ డైమండ్. దీనిని 2016లో వజ్రాల పరిశ్రమకు సంబంధించిన వార్షిక ప్రదర్శనలో కూడా ప్రదర్శించాడు. అప్పటి నుంచి దీనికి విస్తృత ప్రచారం లభించింది.ఈ వజ్ర వినాయకుడి బొమ్మను కొనడానికి చాలా మంది ముందుకు వచ్చారని, అయితే దాని అమ్మే ఆలోచన తనకు లేదని రాజేశ్ పాండవ్ అంటున్నారు. ఇప్పుడు దీని విలువ 500 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా! ప్రపంచంలో ఇంతకు మించి విలువైన వినాయకుడి ప్రతిమ మరో చోట ఉండటం అసాధ్యం!