ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి వాటిని అధిగమించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం.. ఫలితం దొరక్క నిరాశ పడుతూ ఉంటాం. చివరికి చేసేదేం లేక ఆ దైవానికి మొక్కుతాం .
కానీ మీకు తెలుసా !సమస్యలు, ఆపదలు, ఆటంకాలు తొలగడానికి అద్భుతమైన మార్గం సుందరాకాండ పారాయణం.
ప్రతి మనిషి జీవితంలో కష్టాలు అనేవి సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి వాటిని అధిగమించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం.. ఫలితం దొరక్క నిరాశ పడుతూ ఉంటాం. చివరికి చేసేదేం లేక ఆ దైవానికి మొక్కుతాం .
కానీ మీకు తెలుసా !సమస్యలు, ఆపదలు, ఆటంకాలు తొలగడానికి అద్భుతమైన మార్గం సుందరాకాండ పారాయణం.
సుందరకాండ పారాయణ వలన ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది సుందరకాండలోని వివిధ సర్గాలు పారాయణంచేయడం వల్ల మన జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.
సుందరకాండ పారాయణం చేసిన వారికి హనుమంతుని ఆశీర్వాదం అనేది తప్పకుండా లభిస్తుంది. ఆయన ఆశీర్వాదం ఉంటే మనకి అన్ని జయాలే . శత్రు భయం, రుణ భయం ఇలాంటివి దరిచేరవు.రామాయణంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సుందరాకాండ పారాయణలో మనకి హనుమంతుని గుణగణాలు అతని విజయవంతమైన ధైర్యవంతమైన జీవిత గాధ గురించి తెలుస్తుంది.
శని దశ ,అంతర్దశ ,మహాదశలో, ఏలినాటిశని ఎవరైతే వీటితో బాధపడుతున్నారు వారు సుందరాకాండ పారాయణం చేయడం వలన శని బాధ నుంచి విముక్తి పొందుతారు.శనిదేవుడు హనుమంతుడికి రుణపడి ఉంటాడు కాబట్టి శని ప్రభావాన్ని తగ్గించేటప్పుడు హనుమంతుని ఆరాధిస్తే వారికి ఖచ్చితంగా సమస్యలు తగ్గుతాయి. సుందరకాండ పారాయణం చేసిన వారికి శనిబాధ అనేది ఉండదు .
సుందరకాండ పారాయణ చేయడం వలన ఇంట్లో వ్యతిరేక శక్తులు అనేవి తొలగించబడి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇంట్లోసుందరకాండ పారాయణ చేస్తున్నవారికి హనుమంతుడు జ్ఞానాన్ని శక్తిని ప్రసాదిస్తాడు. సుందరాకాండ పారాయణం చేసే వారికివీలుగా ఉండే విధంగా ఇప్పుడు మార్కెట్లో చాలా చోట్ల పుస్తకాలు లభిస్తున్నాయి.
ఎలాంటి సమస్యలకి సుందరాకాండ ఎలాంటి ఫలితం ఇస్తుందో ఇప్పుడు చూద్దాం
*విద్యాప్రాప్తి కోసం సుందరాకాండను ఒకసారిపూర్తిగా పారాయణం చేయాలి .
*పనుల్లో విజయం కోసం 40 రోజులు సుందరకాండ ను చదవాలి
*మనఃశాంతి కోసం 21 రోజుల పారాయణం చేయాలి .
*స్వగృహం కోసం 40 రోజులు సుందరకాండ పారాయణం చేయాలి .
*రోగవిముక్తి కోసం 21 రోజులు పారాయణం చేయాలి
ఇలా వివిధ బాధలకు,సమస్యలకు సుందరకాండ పారాయణం ఎన్నోరకాలుగా మనకు సహకరిస్తుంది. సమస్యలు తొలగిపోవటంతో పాటు జ్ఞానం సిద్ధిస్తుంది . పారాయణ చేసేటప్పుడు భక్తితో హనుమంతుణ్ణి శ్రద్ధ్దగా శక్తి కొలది పూజ జరిపి నైవేద్యాలను సమర్పించాలి .