క్రిస్మస్(Christmas) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిల(Church)న్నీ విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోతున్నాయి. మన దేశంలో ఉన్న చర్చిలు కూడా కొత్త కళను సంతరించుకున్నాయి. అసలు మన దేశంలోని అతి పురాతమైన చర్చి(Anncient Church) ఎక్కడ ఉందో తెలుసా? ఆ ప్రార్థనామందిరం చరిత్రమేమిటో తెలుసా? తెలుసుకుందాం పదండి.
క్రిస్మస్(Christmas) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిల(Church)న్నీ విద్యుద్దీపాల కాంతులతో మెరిసిపోతున్నాయి. మన దేశంలో ఉన్న చర్చిలు కూడా కొత్త కళను సంతరించుకున్నాయి. అసలు మన దేశంలోని అతి పురాతమైన చర్చి(Anncient Church) ఎక్కడ ఉందో తెలుసా? ఆ ప్రార్థనామందిరం చరిత్రమేమిటో తెలుసా? తెలుసుకుందాం పదండి. కేరళలోని(Kerala) త్రిసూర్(Trisur) జిల్లా పాలయూర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచడానికి ఏకైక కారణం అక్కడున్న చర్చినే! ఎందుకంటే మన దేశంలో ఉన్న పురాతమైన చర్చి ఇదే! క్రీస్తు పన్నెండు మంది ప్రత్యేక శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ కట్టించిన(St Thomas) చర్చి ఇది! క్రీస్తు మరణం తర్వాత కొన్నేళ్లకు సెయింట్ థామస్ సముద్రమార్గంలో కేరళ తీరానికి చేరుకున్నాడు. అప్పటికే కేరళలో నివాసం ఉంటున్న యూదులను కలిశాడు.వారికి క్రీస్తు సందేశాన్ని వినిపించాడు. క్రైస్తవాన్ని పరిచయం చేశాడు. క్రీస్తుశకం 52లో ఇక్కడ ఓ చర్చిని నిర్మించాడు. ఆ చర్చినే ఆయన పేరుమీద సెయింట్ థామస్ సైరో మలబార్ కేథలిక్(St Thomas Sairo Malabar Kethalik) చర్చిగా ప్రసిద్ధిగాంచింది. ఇదే కాదు, మనదేశంలో మరో ఆరు చర్చిలను సెయింట్ థామస్ నిర్మించాడు. పాలయూర్‌లో ఉన్న ఓ హిందూ ఆలయం ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఉండేడిదట! ఆ గుడి ఆలనాపాలనా ఎవరూ చూసుకునేవారు కాదట! అప్పుడా ఆలయానికి కొద్దిపాటి మార్పులు చేసి చర్చిని నిర్మించారట! అందుకే కాబోలు ఈ చర్చి ప్రవేశద్వారం హిందూ దేవాలయంలాగే ఉంటుంది. ఈ చర్చి నిర్మాణంలో హిందూ వాస్తురీతులు కనిపిస్తాయి. క్కడక్కడ పర్షియన్ శైలి కూడా కనిపిస్తుంది. 17వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చిన ఓ ఇటాలియన్ మతబోధకుడు చర్చిని విస్తరింపచేశాడట! 18వ శతాబ్దానికి వచ్చేసరికి టిప్పు సుల్తాన్ సేనలు చర్చిని ధ్వంసం చేశారట! ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ చర్చి పునర్నిర్మాణానికి నోచుకుంది