✕
పుదుచ్చేరిలో(Puducherry) ఉన్న మనకుల వినాయక ఆలయం(Manakula vinayaka Temple) సుప్రసిద్ధమైనది! సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు ఫ్రెంచ్వారి(French) ఆధీనంలో ఉండేది. ఫ్రెంచ్ కాలనీ(French Colony) మధ్యలో ఈ ఆలయం ఉండటం వారికి నచ్చలేదట! ఆలయాన్ని తొలగించాలని చాలా ప్రయత్నాలు చేశారట! వినాయకుడి విగ్రహాన్ని(Idol) ఎన్నోసార్లు సముద్రంలో(Sea) పడేశారట! అలా పడేసిన ప్రతీసారి విగ్రహం అలలతో కదిలివచ్చి గర్భగుడికి చేరుకునేదట!

x
Manakula vinayaka Temple
-
- పుదుచ్చేరిలో(Puducherry) ఉన్న మనకుల వినాయక ఆలయం(Manakula vinayaka Temple) సుప్రసిద్ధమైనది! సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ ఆలయం ఉన్న ప్రాంతం ఒకప్పుడు ఫ్రెంచ్వారి(French) ఆధీనంలో ఉండేది.
-
- ఫ్రెంచ్ కాలనీ(French Colony) మధ్యలో ఈ ఆలయం ఉండటం వారికి నచ్చలేదట! ఆలయాన్ని తొలగించాలని చాలా ప్రయత్నాలు చేశారట! వినాయకుడి విగ్రహాన్ని(Idol) ఎన్నోసార్లు సముద్రంలో(Sea) పడేశారట! అలా పడేసిన ప్రతీసారి విగ్రహం అలలతో కదిలివచ్చి గర్భగుడికి చేరుకునేదట! దాంతో తమ ప్రయత్నాలను విరమించుకున్నారట! వినాయకుడి మహిమను చూసిన జనం ఫ్రెంచ్వారి మీద తిరగబడి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు.
-
- తర్వాతి కాలంలో భక్తులిచ్చిన విరాళాలతో మరింత అద్భుతంగా రూపుదిద్దుకుంది.. ఇప్పుడు ఆలయం ఉన్న వీధిని ఒకప్పుడు ఒర్లెన్ స్ట్రీట్(Orleans Street) అనేవారు. ఇప్పుడేమో మనకుల వినాయక కోవెల వీధిగా(Mankula Vinayaka Kovela street) మారింది.. ఈ వీధిలోనే పెద్ద మండపం ఉంది.
-
- మండపంపై భాగంలో సిద్ధి, బుద్ధిలతో వినాయకుడి వివాహ వేడుక వర్థచిత్రం ఉంటుంది. మహామండపంలో దక్షిణగోడపై వినాయకుడి 32 రూపాలను. వివిధ దేశాలలోని వినాయకుడి ఆలయాల వివరాలను పొందుపరిచారు. గర్భాలయంలో విఘ్నేశ్వరుడు చతుర్భుజాలతో ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తాడు.
-
- స్వామివారిని మనకుల వినాయకుడని ఎందుకంటారంటే, తమిళంలో మనల అంటే ఇసుక. కులం అంటే కోనేరు. ఒకప్పుడు ఇసుకతో నిండిన పుష్కరణి ఉండేది ఇక్కడ! ఆ కోనేరు పక్కనే కొలువయ్యాడు కాబట్టే మనకుల వినాయకుడని పిలుస్తున్నారు. గోపురాన్ని బంగారంతో తాపడం చేశారు. గర్భాలయం వెనుక ఉన్న ఉప ఆలయాలలో బాలగణపతి.. బాలసుబ్రహ్మణం కొలువై ఉన్నారు.
-
- ఉత్తరంవైపున ఉత్సవమూర్తుల మండపం ఉంది.. ఇక్కడ వివిధ రూపాల వినాయకుడిని చూడవచ్చు.. ఆ పక్కనే స్వర్ణ, రజత రథాలు ఉన్నాయి.. స్థానిక భక్తులు తమ సంతానాన్ని తొలిసారి ఈ ఆలయానికి తీసుకొస్తారు.. నామకరణం నుంచి అక్షరాభ్యాసం వరకు అన్ని కార్యక్రమాలను ఇక్కడే జరిపిస్తారు.

Ehatv
Next Story