శరన్నవరాత్రి మహోత్సవాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిలో వైభవోపేతంగా జరుగుతున్నాయి.

శరన్నవరాత్రి మహోత్సవాలలో విజయవాడ ఇంద్రకీలాద్రిలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. కొండపై వెలిసిన కనకదుర్గమ్మ అయిదో రోజు, గురువారం అశ్వయుజ శుద్ధ పంచమి రోజున శ్రీ మహా చండీ దేవి(Sri Maha Chandi Devi) అలంకారములో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.

దేవానాం కార్యసిద్ధ్యర్థం మావిర్భవతిసా యదా |

ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యా ప్యభిధీయతే |

దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించింది. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయి.

ehatv

ehatv

Next Story